న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ క్రికెట్‌లో ఓ సంచలనం సృష్టించాడు.ముంబైలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య కొనసాగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇండియాకు సంబంధించిన 10 వికేట్లు తీసి రికార్డు సృష్టించాడు.
ఇలా టెస్ట్ క్రికెట్‌లో.ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్స్ తీసిన మూడవ క్రికెటర్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు.
తన స్పిన్ బౌలింగ్‌తో ఇండియన్ బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు.ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 119 రన్స్ ఇచ్చి పది వికేట్స్ తీశాడు.దీంతో 1999లో అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు అజాజ్.1999 ఫిబ్రవరిలో అనిల్ కుంబ్లే 10 వికెట్స్ తీశాడు.భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టులో 47.5 ఓవర్లు వేసి 119 రన్స్ ఇచ్చి, 12 ఓవర్లు మేడిన్ చేసి.పది వికెట్స్ తీసుకున్నాడు అజాజ్.
అజాజ్ కంటే మందు ఈ రికార్డులను క్రియేట్ చేసిన వారు మరో ఇద్దరు ఉన్నారు.
టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ టైం 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో జిమ్ లేకర్ ఓకే ఇన్నింగ్స్‌లో 53 రన్స్ ఇచ్చి పది వికెట్లు తీసుకున్న ఫస్ట్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.తర్వాత 1999లో పాకిస్థాన్, ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్ లో 74 రన్స్ ఇచ్చి పది వికెట్స్ తీసుకున్నాడు.

తాజాగా ఆ రికార్డులను సమయం చేసి వారి సరసన చేరాడు అజాజ్.అయితే అజాజ్ పటేల్ మన ఇండియాకు చెందిన వాడే.ముంబైలో జన్మించిన అతడున్యూజిలాండ్ లో సెటిల్ అయ్యాడు. ఇక అద్భుత ప్రదర్శన కనబరుస్తూ క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రుతలూగిస్తున్న అజాజ్‌ను అనేక మంది ప్రశంసిస్తున్నారు.మరో వైపు ఆయన రికార్డును చూసిన అతని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.ఇదే ఊపును కొనసాగించాలని కోరుకుంటున్నారు.
రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలంటూ క్రికెట్ ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు.