ఐపీఎల్ 13 వ సీజన్ లో భాగంగా కోల్కత్తా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తాజాగా జరిగిన మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో మ్యాచ్ టై గా ముగిసింది.దీంతో సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం జరిగింది.
సూపర్ ఓవర్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయగా అందులో కేవలం మూడు బాల్స్ లో రెండు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో మూడు పరుగుల లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్ వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ ఐదు బంతుల్లో వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది.నరాలు తెగే ఉత్కంఠత నడుమ ఈ మ్యాచ్ ఫలితం చివరగా సూపర్ ఓవర్ ద్వారా తేలింది.
అయితే మ్యాచ్ ఒకవైపు ఇలా ఉంటే అభిమానులు మాత్రం మైదానంలో ఉన్న అంపైర్ పైనే కళ్ళని ఉన్నాయి.ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఓ మహిళా అంపైర్ మైదానంలో అంపైరింగ్ చేయబోతోందని అందరూ అనుకున్నారు.
కాకపోతే, అక్కడ ఉన్నది మహిళ కానేకాదు.పురుషుడే.
ఈ విషయాన్ని తెలుసుకొని నెటిజెన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ల్స్ చేస్తున్నారు.ఇక అది అలా ఉంటే.
మొట్టమొదటిసారిగా తన స్టైల్ తో ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు ఆ అంపైర్. పొడవాటి జంపాల జుట్టు తో వచ్చిన ఆ అంపైర్ పేరు పశ్చిమ్ పతక్.
ప్రస్తుతం ఈయన లుక్ అందర్నీ ఇట్టే కట్టిపడేసింది.
చూడటానికి అచ్చం మహిళల కనిపించే ఆయనను చూసి కొందరు క్రికెటర్లు కూడా అంపైరింగ్ చేయడానికి ఓ మహిళ వస్తుందేమో అన్నట్లుగా పొరపాటు పడ్డారు.
మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న కూడా ఆ అంపైర్ పై కెమెరాలు అదేపనిగా చూపించడంతో ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు.ముఖ్యంగా అతని హెయిర్ స్టైల్ పై పెద్ద ఎత్తున్న ట్రోల్ల్స్ చేస్తున్నారు నెటిజన్స్.
అయితే ఇది వరకు ఈయన ఇలా ఉండే వారు కాదట.చాలా సింపుల్ గా మామూలు యంపైర్స్ ఎలా ఉంటారో అలాగే ఉంటూ.
దేశవాళి మ్యాచ్ లకు హెల్మెట్ తో హాజరయ్యే అంపైర్ గా అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది.