మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.నాగబాబు (Nagababu) నివాసంలో శుక్రవారం సాయంత్రం కేవలం మెగా అల్లు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగిందని చెప్పాలి.
ఇక ఈ నిశ్చితార్థ వేడుకలో భాగంగా మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొని సందడి చేశారు.ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక(Niharika) తన అన్నయ్య నిశ్చితార్థ (Engagment) వేడుకల్లో సందడి చేశారు.
తన అన్నయ్య వదినలతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఇలా ఈ ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ లావణ్య ( Lavanya Tripathi ) తన వదినగా రావడంతో తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లావణ్యతో కలిసి దిగిన ఫోటోని నిహారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈరోజు కోసం తాను చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు.ఇలా ఈమె కామెంట్ చేయడంతో వీరిద్దరి ప్రేమ గురించి తనకు ముందే తెలుసని, లావణ్య త్రిపాఠి తనకు వదినగా రావడం మనస్ఫూర్తిగా తనకు ఇష్టమేనంటూ చెప్పకనే చెప్పేశారు.ఇక నిహారిక వివాహంలో కూడా లావణ్య త్రిపాఠి పాల్గొని సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ నిశ్చితార్థ వేడుకలలో నిహారిక భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య(Venkata Chaitanya) ఎక్కడ కనిపించలేదు.
దీంతో వీరిద్దరూ విడాకులు (Divorce) పక్కా తీసుకున్నారని అర్థమవుతుంది.

ఇకపోతే తన భర్త వెంకట చైతన్యతో విడాకులు తీసుకోవడం వల్ల తన తండ్రి నాగబాబు నిహారికను దూరం పెట్టారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ ఫోటో ద్వారా ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని నిహారిక ఆ వార్తలను ఖండించినట్టు తెలుస్తుంది.నిహారికను మెగా ఫ్యామిలీ దూరం పెట్టలేదని ఈ ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది.
అయితే భర్తకు దూరంగా ఉన్నటువంటి నిహారిక తన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ప్రస్తుతం నిహారిక షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.