ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి మొబైల్ లో వాట్సాప్ యాప్ ఉంటుంది.ఎంతోమంది ప్రజాదరణ పొందిన యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో వాట్సాప్ తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూనే వస్తుంది.ఈ క్రమంలోనే వాట్సాప్ మళ్ళీ ఒకసారి కొత్త ఫీచర్ ను మీ ముందుకు తీసుకురానుంది.
అదే ‘మై కాంటాక్ట్స్ ఏక్సెప్ట్ ‘ ( My Contacts Except) అనే ఒక సరికొత్త ఫీచర్ ను ప్రవేశ పెట్టనుంది.ఈ ఫీచర్ యూజ్ చేసుకుని మీ వాట్సాప్ అకౌంట్లో ఉన్నా ఏదైనా ఒక కాంటాక్టు హైడ్ చేసుకోవచ్చు అన్నమాట.
అయితే ఈ అప్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు.రానున్న రోజుల్లో త్వరలోనే అందుబాటులోకి రానుంది.
ఈ క్రమంలో వాబేటైంఫ్ (wabetainfo) ఒక ప్రకటనలో ఈ ఫీచర్ గురించిన వివరాలను ప్రకటించింది.అసలు ఆ ఫీచర్ వలన యూజ్ ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం మన వాట్సాప్ అకౌంట్ లో మన వాట్సాప్ ను ఎప్పుడు చివరి సరిగా చూసాము అనేది కనిపించడంతో పాటు మన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ అండ్ వాట్సాప్ స్టేటస్ కూడా అందరు చూసే వీలుంది.అయితే ఈ మూడు ఆప్షన్లలో వాట్సాప్ లాస్ట్ సీన్ అనే ఆప్షన్ మీ కాంటాక్టులో ఉన్న వారందరికి కనిపిస్తుంది.
అలా కాకుండా ఇకపై ఈ సరికొత్త ఫీచర్ వలన మీ ఫోన్లో ఉన్న ఏ కాంటాక్టు పర్సన్ అయితే మీ వాట్సాప్ లాస్ట్ సీన్ చూడకూడదో అని మీరు అనుకుంటారో వారు చూడకుండా కూడా కంట్రోల్ చేయవచ్చు అన్నమాట.అలాగే ఇందులో ఎవిరి వన్, మై కాంటాక్ట్స్, నో బాడీ అనే ఆప్షన్లలో ఏది అయిన ఒక అప్షన్ ఎంచుకుని మీకు నచ్చని కాంటాక్టులను హైడ్ చేయొచ్చు.

ఒకవేళ మీరు కనుక ఎవరీవన్ ఆప్షన్ ఎంచుకుంటే మీ స్టేటస్ అందరూ చూస్తారు.అలాగే మీ ప్రొఫైల్ పిక్ తో పాటు మీ స్టేటస్ కూడా చూడవచ్చు.అలా కాకుండా ఓన్లీ మై కాంటాక్ట్స్ అని ఎంపిక చేసుకుంటే మీ కాంటాక్టులో ఉన్నవాళ్లు మాత్రమే చూసే వీలుంది.అదే నో బడీ అని సెలక్ట్ చేసుకుంటే ఎవరు కూడా మీ లాస్ట్ సీన్ చూడలేరు.
ఈ క్రమంలో వాట్సాప్ తీసుకొచ్చే ఈ కొత్త ఫీచర్ తో మీ కాంటాక్టులో ఉన్నవారిలో కూడా ఎవరూ మీ Last Seen, Profile Pic, Status చూడకుండా వారిని హైడ్ చెయవచ్చు అన్నమాట.అయితే ఈ అప్షన్ కేవలం ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వర్షన్లలో మాత్రమే పని చేసింది.
కానీ త్వరలో వాట్సాప్ యూజర్ల అందరికి ఈ ఫెచర్ అందుబాటులోకి రానుంది.