మాజీ సీఎం పై కోడలు ఫిర్యాదు చేసిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది.బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి పై ఆమె కోడలు ఐశ్వర్య రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ కుమార్తె ను ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే పెళ్లి తరువాత ఇద్దరి మధ్య తేడాలు రావడం తో ఆ మధ్య విడాకుల కోసం కూడా దాఖలు చేయగా,ప్రస్తుతం అది కోర్టు పరిశీలనలో ఉంది.అయితే ఆదివారం రోజు రబ్రీ దేవి తన జుట్టు పట్టుకొని లాగి కొట్టారని,సెక్యూరిటీ సిబ్బంది తో ఇంటి నుంచి వెళ్ళగొట్టారంటూ ఆరోపించారు.బీ ఎన్ కాలేజీ వద్ద తన తండ్రి,ఎమ్మెల్యే చంద్రిక రాయ్ పై అసభ్యకర పోస్టర్లు అంటించడం పై ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు తనపై ఇలా దాడికి దిగారు అంటూ ఆమె ఆరోపించారు.

దీనితో ఐశ్వర్య ఫిర్యాదు తో సచివాలయం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.అయితే మరోపక్క సమస్యల నుంచి ప్రజల దృష్టి ని మళ్లించేందుకు రాజకీయ ప్రత్యర్ధులు ఎత్తుగడలు వేస్తున్నారు అంటూ లాలూ చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ ఆరోపిస్తున్నారు.