ఆ చిన్నారి వయసు ప్రస్తుతం ఏడాది మాత్రమే.కానీ అంత చిన్న వయసులోనే సంపాదిస్తూ అందరిని షాక్ కు గురి చేస్తుంది.
ఇంతకీ అంత చిన్న చిన్నారి ఎలా సంపాదిస్తున్నాడనే అనుమానం మీకు కలగవచ్చు.కానీ ఇది నిజం ఆ బుడతడు ఇంత చిన్న వయసులోనే సంపాదిస్తున్నాడు.
ఇంత చిన్న వయసు పిల్లలు ఎలా సంపాదిస్తారు.పెద్ద వాళ్లకు సంపాదన విషయంలో చాలా ఒత్తిడి ఉంటుంది.
అలాంటిది ఆ బుడ్డోడు ఇంత చిన్న వయసులోనే ఎలా సంపాదిస్తున్నాడు అనే కదా మీ సందేహం.అక్కడికే వస్తున్నా.ఇతడు అలా ఎలా సంపాదిస్తున్నాడో తెలుసుకోవాలంటే స్టోరీ లోకి ఎంటర్ అవ్వాల్సిందే.అతడు హాయిలే విమానాల్లో షికార్లు చేస్తూ.
విహార యాత్రలు ఎంజాయ్ చేస్తూ.బీచ్ లు పార్కుల్లో తిరుగుతూ డబ్బు సంపాదిస్తున్నాడు.
అది ఎలా అంటే అతడు చిన్న వయసులోనే టూరిస్టుగా డబ్బు సంపాదిస్తున్నాడు.
ఏడాది వయసులోనే విహార యాత్రలు చేస్తున్నాడు.
ఆ బుడ్డోడు ఇప్పటికే 45 సార్లు విమాన ప్రయాణం చేసాడంటే నమ్మండి.ఈ బుడ్డోడు అమెరికాకు చెందిన వాడు.

ఇతడి పేరు బేబీ బ్రిగ్స్.బ్రిగ్స్ ఇప్పటికే యుఎస్ లోని 16 రాష్ట్రాలను చేసేసాడు.ఆ ప్రదేశాల్లోని పార్కులు, బీచ్ లు తిరుగుతూ షికార్లు చేసాడు.దీంతో బ్రిగ్స్ అతి చిన్న వయసులోనే ట్రావెల్ ఇన్ ఫ్లుయెన్సెర్ అయ్యాడు.

బ్రిగ్స్ కేవలం యుఎస్ లో ట్రావెల్ చేయడం వల్ల స్కాలర్ షిప్ నుండి నెలకు దాదాపు 1,000 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 75000 రూపాయలు సంపాదిస్తున్నాడు.అంతేకాదు స్కాలర్ షిప్ మాత్రమే కాకుండా తన డైపర్ లు ఇంకా వైప్ లను కూడా ఉచితంగానే పొందుతున్నాడు.తన తల్లిదండ్రులు బ్రిగ్స్ ఫోటోలను, వీడియోలను తను ఏ ఏ ప్రాంతాల్లో చుట్టి వస్తాడో అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.ఇక బ్రిగ్స్ కు సోషల్ మీడియాలో 30 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.
చూసారుగా ఇంత చిన్న వయసులోనే ఈ బుడ్డోడు ఎలా సంపాదిస్తున్నాడో.