అదో అరుదైన పక్షి.. ఓకే జీవిలో ఆడ, మగ లక్షణాలు..!

ప్రతి జీవిలో ఆడ, మగ అనే భేదం ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే.కేవలం మనుషుల్లోనే కాదు జంతువులు పక్షులలో కూడా ఈ లింగభేదం కనబడుతుంది.

 Pakshi, Bird, Rare Bird, Social Media, Viral, Men And Women-TeluguStop.com

అయితే తాజాగా ఓ పక్షికి మాత్రం అటు ఆడ లక్షణాలు, ఇటు మగ లక్షణాలు రెండు కలిపి ఉన్నట్లుగా గుర్తించారు.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

మనకు ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు కనబడుతూనే ఉంటాయి.ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచం నలుమూలల ఎటువంటి కొత్త జీవులు కనిపించిన వెంటనే దానిని ప్రపంచం మొత్తానికి తెలిపేందుకు సహాయం చేస్తోంది.

ఇక ఈ మధ్య కాలంలో ప్రపంచంలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.మామూలుగా కొన్ని రకాల పక్షులు చూడటానికి ఎంతగానో ఆకర్షణీయంగా ఉంటాయి.

ఆ పక్షికి ఉండే రంగులు, ఈకలు ఇలా అన్ని కూడా మనకు ఆహ్లాదాన్ని చేకూరుస్తాయి.అయితే తాజాగా ఓ పక్షకి మగ, ఆడ భాగాలు ఉండటం కొందరు గుర్తించారు.

ఇక ఈ పక్షి పేరు రోజ్ బ్రెస్టెడ్ గ్లాస్ బీక్.పక్షుల పై అనేక అధ్యయనాలు చేస్తున్న ఓ పరిశోధకుడు ఈ పక్షిని చూసి నిజంగా ఆశ్చర్యపోయాడు.

అమెరికా దేశంలోని పెన్సెల్వేనియాలోని పౌడర్‌మిల్‌ నేచర్‌ రిజర్వ్‌ సెంటర్‌లో ఈ అరుదైన పక్షి ని కనుగొన్నారు.ఇక ఈ పక్షి ని పూర్తిగా చూస్తే ఈ వింత పక్షి రెక్కలు విరుచుకున్నప్పుడు ముఖం నుండి రెక్కల వరకు ప్రతి పార్ట్ లో తేడాలను గమనించవచ్చు.

ఇందులో ముఖ్యంగా ఈ పక్షి రెక్కలను గమనిస్తే ఒకవైపు పసుపుపచ్చగా ఉండగా మరోవైపు గులాబీ రంగులో కనిపిస్తున్నాయి.అంతేకాదు ఈ పక్షికి అటు ఆడ జననాంగాలు, ఇటు మగ జననాంగాలు ఉన్నాయి.

అయితే ఇందుకు సంబంధించి పరిశోధకులు అండాశయంలో రెండు శుక్రకణాలు వెళ్లినప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుందని వారు తెలుపుతున్నారు.ఇలాంటి పరిస్థితిని శాస్త్రీయపరంగా బైలాటరల్ గైనాండరోమోఫిస్మ్ అని పిలుస్తారని పరిశోధకులు తెలుపుతున్నారు.

ఈ రకంకు చెందిన పక్షులు కేవలం ఉత్తర అమెరికా లోని తూర్పు ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయని తెలుపుతున్నారు.ఇది గత కొన్ని సంవత్సరాలుగా అంతరించిపోయే జాతిలో ఈ పక్షులు ఉన్నట్లుగా వారు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube