దేశంలో పంటలు పండించే రైతుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది.రోజురోజుకు పెరుగుతున్న ఖర్చుల వల్ల వ్యవసాయం చేస్తున్న రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు.
అయితే ఒక వ్యక్తి మాత్రం రెండున్నర ఎకరాల్లో అంజీరా పంటను సాగు చేసి సంవత్సరానికి కోటిన్నర రూపాయలు సంపాదిస్తున్నారు.మిగతా అంజీరా రైతులు లక్షలు కూడా లాభాలు పొందలేకపోతుంటే మహారాష్ట్రకు చెందిన సమీర్ మాత్రం కోట్లలో ఆదాయం పొందుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని దౌండే గ్రామంలో సమీర్ డోంబే అనే వ్యక్తి ఉండేవాడు.చిన్నప్పటి నుంచి సమీర్ కు చదువుతో పాటు వ్యవసాయంపై కూడా ఆసక్తి ఉండేది.
ఉన్నత చదువులు చదివిన సమీర్ కు 2013లో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.నెలకు 40 వేల రూపాయల వేతనంతో ఉద్యోగం వచ్చినా ఉద్యోగం చేరిన కొన్ని నెలలకే అతనికి ఉద్యోగం బోర్ కొట్టింది.
వ్యవసాయం వైపు అతని ఆలోచనలు మళ్లాయి.
ఆ తరువాత తాను ఉద్యోగం మానేసి వ్యవసాయం చేయాలని అనుకుంటున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పగా అందరూ సమీర్ ను తిట్టారు.
అయితే సమీర్ మాత్రం తనకు ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో అంజీరా సాగు చేశాడు.ఆ తరువాత ప్రముఖ సూపర్ మార్కెట్ల నిర్వహకులను సంప్రదించి అంజీరా పండ్లు సూపర్ మార్కెట్లకు మంచి ధరకు విక్రయించేలా సమీర్ ఒప్పందాలు చేసుకున్నాడు.
సమీర్ వినూత్నంగా ఆలోచించడం వల్ల స్థానికంగా అతని పేరు మారుమ్రోగిపోయింది.ఆ తరువాత సమీర్ పవిత్రక్ పేరుతో పండ్లను విక్రయించడం ప్రారంభించాడు.కిలో చొప్పున తూకం వేసి పంపిణీ చేసిన పవిత్రక్ బాక్సులు విపరీతంగా సేల్ అయ్యాయి.ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి కూడా సమీర్ కు ఆర్డర్లు వస్తున్నాయి.
ఏడాదికి కోట్లలో ఆదాయం సంపాదిస్తూ సమీర్ వార్తల్లోకెక్కాడు.