గూగుల్ ఫొటోస్ యాప్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది.మనం తీసుకునే ఫొటోలను సేవ్, షేర్, ఎడిట్ చేసుకునేందుకు ‘గూగుల్ ఫొటోస్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రతి ఒక్కరి ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ఫొటోస్ యాప్ వినియోగిస్తున్నారు.తన యూజర్లనే పెంచుకునేందుకు గూగుల్ ఫొటోస్ యాప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.
ఇందులో భాగంగానే ‘సినిమాటిక్ ఫొటోస్ అనే ఒక సరికొత్త ఫీచర్‌ను గూగుల్ ఫొటోస్ యాప్ విడుదల చేసింది.ఈ ఫీచర్ సహాయంతో సాధారణ ఫొటోలను సైతం మూవింగ్ ఫొటోస్ గా మార్చుకోవచ్చు.
అప్పుడు ఫొటోలు ఇంకా రియలిస్టిక్ గా, ఆకర్షణీయంగా చేంజ్ అవుతాయి.ఈ సినిమాటిక్ ఫొటోస్ ఫీచర్ అనేది మూవీ కాన్సెప్ట్ నుంచి డెవలప్ చేయబడింది.
మరి ఈ ఫీచర్ అనేది ఎలా పని చేస్తుంది.? ఈ యాప్ ద్వారా యూజర్లు సినిమాటిక్ ఫొటోస్ ను ఎలా క్రియేట్ చేయగలరు అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఫీచర్ గూగుల్ మెషీన్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌తో వర్క్ చేస్తుంది.ఫోకస్ లో ఉన్న ఫొటోలను ఫోకస్ లో లేని ఫొటోల డేటాను యూజ్ చేసి ఫొటోను వివిధ లేయర్ లుగా గూగుల్ ఏఐ విభజిస్తుంది.
మెషిన్ లెర్నింగ్ ద్వారానే లేయర్ లు పూర్తిగా నిర్ధారించడం జరుగుతుంది.కాబట్టి ఫొటో డెప్త్ డేటాను యూజర్లు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.
అలాగే ఈ లేయర్‌లను యాడ్ చేశాక వర్చువల్ కెమెరాను యానిమేట్ చేయడం ద్వారా 3D రిప్రజెంటేషన్ క్రియేట్ అవుతుంది.ఒకవేళ ఫోటో 2D లో ఉన్నప్పటికీ ఈ ఫీచర్ యూజ్ చేయడం వలన ప్రతి ఫొటోకి 3D లుక్ వస్తుంది.గూగుల్ ఏఐ సినిమాటిక్ ఫొటోను డెవలప్ చేసేటప్పుడు లేయర్‌ల మధ్య గ్యాప్ ను ఫిల్ చేస్తుంది.ఫలితంగా వర్చువల్ కెమెరా అనేది ఫొటో అంతటా ఫ్రీగా మూవ్ అవుతుంది.
మరి సినిమాటిక్ ఫోటోను క్రియేట్ చేయడం సాధ్యమేనా అంటే సాధ్యం కాదు అని చెప్పాలి.
యూజర్లు సినిమాటిక్ ఫొటోను మాన్యువల్‌గా క్రియేట్ చేయడానికి సాధ్యం కాదు.ఒక్కగూగుల్ ఏఐ మాత్రమే సరిపడా ఫొటోలను గుర్తించి వాటిని సినిమాటిక్ ఫొటోలుగా క్రియేట్ చేస్తుంది.మాన్యుయెల్ గా చేయాలంటే ఇది కష్టమైన పని.
ఇలా లేయర్ లను క్రియేట్ చేయలన్నా, లాయర్ల మధ్యలో గ్యాప్స్ ఫిల్ చేయలన్నా గాని, మల్టిపుల్ లేయర్‌లను యానిమేట్ చేయడానికి చాలా ప్రాసెసింగ్ అవసరమవుతుంది.అందుకే గూగుల్ ఏఐ సరైన ఫొటోలను ఎంపిక చేసుకొని ప్రాసెసింగ్ చేసేస్తోంది గూగుల్.యూజర్లు సినిమాటిక్ ఫొటోలను క్రియేట్ చేయలేకపోయినా చింతించాలిసిన పని లేదు.ఎందుకంటే ఏఐ క్రియేట్ చేసిన ఫొటోలను యూజర్లు సేవ్ చేసుకునే వెసులుబాటు ఉంది.ఒకసారి మీ గూగుల్ ఫొటోస్ యాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే సినిమాటిక్ ఫొటోలు గూగుల్ ఏఐ ద్వారా ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి.వాటిని మీకు కావాలంటే సేవ్ చేసుకోవచ్చు.