ఇండియాలోనే ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయదారు అయినటువంటి టాటా మోటార్స్ సంస్థ పోర్ట్‌ఫోలియోలో EVలను మరింత పెంచుకోవడానికి కృషి చేస్తోంది.దాదాపు కొన్ని నెలల క్రితం టాటా టియాగో EVని భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
ఇది కాకుండా… టిగోర్ EV, Nexon EV ప్రైమ్ మరియు Nexon EV మ్యాక్స్ వంటి ఎలక్ట్రిక్ కార్లు కూడా టాటా నుండి మార్కెట్లోకి వచ్చేశాయ్.కాగా ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పో 2023లో టాటా మోటార్స్ ఏకకాలంలో 3 ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తోంది.
అయితే, ఇపుడు ఆటో ఎక్స్‌పోలో ఏ రకమైన టాటా ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాం.

టాటా నుండి ALFA ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ రాబోతోంది.అలాగే Ziptron ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ పంచ్ EVలో అందుబాటులో వుంది.ఇది రెండు బ్యాటరీ ప్యాక్ లతో వస్తోంది.
ఇంటీరియర్ లుక్ పెట్రోల్ వేరియంట్ లాగే ఉంటుంది.కాగా దీనిలో EV-థీమ్ కలర్ డిటైలింగ్‌తో డార్క్-టోన్డ్ ఇంటీరియర్స్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌పై ట్రై-యారో ప్యాటర్న్‌తో కూడిన ఎలక్ట్రిక్ బ్లూ యాక్సెంట్‌లు వస్తున్నాయి.
ఇకపోతే టాటా మోటార్స్ ప్రకారం, ఈ కారు కనీసం 500 కిమీల రేంజ్ ఇవ్వగలదు.డిజైన్ పరంగా, అవిన్య కాన్సెప్ట్ ఎమ్‌పివి, హ్యాచ్‌బ్యాక్ మరియు క్రాస్‌ఓవర్ చాలా బావుంటుంది.

ఈ EV ముందు భాగంలో ‘T’ ఆకారపు LED స్ట్రిప్ చాలా ఆకర్షణీయంగా పొందుపరిచారు.ఇది హెడ్‌ల్యాంప్‌ను కనెక్ట్ చేసే DRL లాగా పనిచేస్తుంది.ఇది డ్యూయల్ లేదా క్వాడ్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌ను కలిగి వుంది.ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన కొత్త EV ప్లాట్‌ఫారమ్ ఆధారంగా కంపెనీ కాన్సెప్ట్ కారు ఇది.ఈ కాన్సెప్ట్ కారు కూపే-డిజైన్‌పై ఆధారపడి నడుస్తుంది.కాగా దీనిని ‘లెస్ ఈజ్ మోర్‘ అని పిలుస్తారు.
ఇది కంపెనీ యొక్క ఇతర EVలలో కూడా చూడవచ్చు.దీని ICE వెర్షన్ కూడా చూడవచ్చు.
ఈ కారు పరిధి దాదాపు 400-500 కి.మీ.







