సోషల్ మీడియాలో చాలా వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.ఓ సర్వే ప్రకారం ఒక నిముషానికి సుమారుగా కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతాయని అంచనా.
దాని బట్టి ఆలోచించండి… మనవాళ్ళు ఏ రీతిగా సోషల్ మీడియాను వాడుతున్నారో? నానాటికీ స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరిగిపోవడం వలన కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇక అలా నిత్యం అప్లోడ్ అవుతున్న వీడియోలలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.
సదరు వీడియోలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటే నెటిజన్లు వాటిని పదేపదే చూసి, తెలిసినవారికి కూడా షేర్లు చేస్తూ వుంటారు.
విషయంలోకి వెళితే, పెద్ద పెద్ద భవనాలలో లిఫ్ట్ వాడటం అనేది పరిపాటి.
హాస్పిటల్స్, అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో లిఫ్ట్ తప్పనిసరి.ఈ క్రమంలో టెక్నాలజీ మీద పెద్దగా అవగాహన లేక కొంతమంది ముసలి వాళ్లు ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు మనం చూసాం.
ఈ తరహాలో ఒక పెద్ద ప్రమాదం జరగగా దాని నుండి రెప్పపాటు క్షణాల్లో పేషెంట్ బయటపడ్డాడు.
ఓ హాస్పిటల్ లో ఓ వ్యక్తి ఆపరేషన్ చేయించుకున్నాడు.
ఆపరేషన్ కాగానే అతడిని స్టెచర్ పై లిఫ్టులో వేరే చోటికి వార్డ్ బాయ్స్ తరలించడానికి ప్రయత్నిస్తున్నారు.అలా లిఫ్ట్ లోకి అతడిని స్టెచర్ పై లోపలికి తీసుకెళ్లే క్రమంలో ఆగి ఉన్న లిఫ్ట్ ఒక్కసారిగా కిందికి వెళ్ళిపోయింది.
దీంతో స్టెచర్‌పై లోపల ఉన్న పేషెంట్ కూడా కింద పడిపోయాడు.అయితే కొంత కిందకు పోయిన తర్వాత లిఫ్ట్ ఆగిపోయింది.
దీంతో అదృష్టం కొద్దీ.పేషెంట్ పెనుప్రమాదం నుండి బయటపడ్డాడు.
అలాకాకుండా లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని ఉంటే అతడు చనిపోయేవాడు.