Chalaki Chanti: రీ ఎంట్రీ ఇచ్చిన చలాకి చంటి.. ఆరోగ్యం కుదుటపడినట్టేనా?

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి( Chalaki Chanti ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ లో( Jabardasth ) తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి కమెడియన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు చంటి.

 Chalaki Chanti: రీ ఎంట్రీ ఇచ్చిన చలాకి చ-TeluguStop.com

గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో( Bigg Boss 6 ) కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే.కానీ బిగ్ బాస్ షో ద్వారా చంటికి పెద్దగా గుర్తింపు దక్కలేదు.

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంటి శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ షోలో తనదైన శైలిలో కామెడీ చేసిన నవ్వించాడు.ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు చంటి బుల్లితెరపై అంతగా కనిపించడం లేదు.

Telugu Chalaki Chanti, Chalakichanti, Jabardasth, Sridevi-Movie

దాంతో అభిమానులు ఏమయిందా అని ఆరా తీయగా ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.చంటీకి హార్ట్ ఎటాక్( Heart Attack ) రావడంతో హాస్పటల్లో చేర్పించారని ప్రస్తుతం చంటికి ఐసీఈలో చికిత్స జరుగుతోంది అంటూ వార్తలు జోరుగా వినిపించాయి.అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దీంతో ఇప్పట్లో చంటి కోలుకునేలా లేడు బుల్లితెర పైకి రీ ఎంట్రీ ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది అని అందరూ అనుకున్నారు.

Telugu Chalaki Chanti, Chalakichanti, Jabardasth, Sridevi-Movie

కానీ తాజాగా ఒక్కసారిగా బుల్లితెరపై కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు చంటి.కాగా ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో చంటికి గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే.ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొన‍్నప్పటికీ, దాని నుంచి బయటపడ్డాడు.ఇది జరిగిన మూడు నెలలు కూడా కాలేదు.అప్పుడే ప్రముఖ కామెడీ షోలో ప్రత్యక్షమయ్యాడు.అయితే చూడటానికి కాస్త డల్‌గానే కనిపించాడు.

దీంతో ఫ్యాన్స్ చంటి హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నారు.చంటి ఆరోగ్యం కూడా కుదుటపడినట్లేనా అని యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube