Krishna Mahesh Babu : మహేష్ బాబు ఫ్యాన్ మేకింగ్ వీడియో.. ఒకే ఫ్రేమ్ లో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే అనారోగ్యం కారణంగా కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే.సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీ మూగబోయింది.

 Superstar Krishna And Mahesh Babu Edit Video Goes Viral Social Media , Super Sta-TeluguStop.com

సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని అటు ఘట్టమనేని ఫ్యామిలీ ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి వ్యక్తి తెచ్చుకున్న ఆ నట శేఖరుడికి రాజకీయ నాయకులు తెలుగు సినీ ప్రముఖులు అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు.

సూపర్ స్టార్ కృష్ణ ను కడసారి చూసుకునేందుకు వేలాదిమంది అభిమానులు కృష్ణ ఇంటి వద్దకు చేరుకున్నారు.

కృష్ణను కడ సారి చోరీ చూపుకు వచ్చిన అభిమానులను చూసి యావత్ సినీ ప్రపంచం ఆశ్చర్యపోయింది.

ఇక సూపర్ స్టార్ కృష్ణ మరణంతో మహేష్ బాబు చాలా కృంగిపోయారు.ఒకే ఏడాదిలో వరుసగా మూడు మరణాలు చోటు చేసుకోవడంతో మహేష్ బాబు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఈ క్రమంలోని మహేష్ బాబు అభిమానులు అన్న నువ్వు అదైర్య పడకు మీకు మేము ఉన్నాము అంటూ మహేష్ బాబుకు ధైర్యం చెప్పారు.ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ ఫ్యాన్స్ ఎడిట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియోని చూసిన మహేష్ అభిమానులు తెగ వైరల్ చేయడంతో పాటుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఆ వీడియో మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నటించిన సన్నివేశాలలో కొన్ని సన్నివేశాలను పక్కపక్కనే పోల్చుతూ ఒక వీడియో సాంగ్ ను సెట్ చేశారు.ఆ వీడియోని చూసిన మహేష్ అభిమానులు సంతోషపడుతున్నారు.ఇలా ఒకే ఫ్రేమ్లో పక్కపక్కన మహేష్ బాబుని కృష్ణను చూడటం చాలా ఆనందంగా ఉంది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube