Jaya chitra mother : నటి జయచిత్ర తల్లి కూడా ఒకప్పటి హీరోయిన్ అని మీకు తెలుసా ?

చాల మంది కొన్ని విషయాలను తమ తల్లుల దగ్గరే నేర్చుకుంటారు.అయితే హీరోయిన్ జయ చిత్ర మాత్రం నటన కూడా తన తల్లి వద్దే నేర్చుకుందట.

 Jaya Chitra Mother Also Heroine ,jaya Chitra, Mother, Jaya Shree , Tollywood, N-TeluguStop.com

నటి జయచిత్ర సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటి.ఆమె కెరీర్ హీరోయిన్ గా ముగిసిపోగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారారు.టీవీ ఆర్టిస్ట్ గా నిర్మాత గా, దర్శకురాలిగా కూడా చేసి అన్ని విషయాల్లో పట్టు సాధించారు.అయితే జయ చిత్ర సినిమా ఇండస్ట్రీ కి రావడానికి గల ముఖ్య కారణం ఆమె తల్లి అమ్మాజీ.

అమ్మాజీ కూడా ఒక హీరోయిన్ అనే విషయం చాల మందికి తెలియదు.<.br>

అమ్మాజీ ఆమె అసలు పేరు కాగా, ఆమె సినిమా పేరు జయశ్రీ.మొదట్లో జయ చిత్ర పుట్టడానికి ముందు ఆమె మాములు హౌస్ వైఫ్ గానే ఉండేది.జయ చిత్ర తండ్రి లాయర్ గా పని చేసేవారు.ఆ తర్వాత వెటర్నరీ డాక్టర్ గా మారారు.జయశ్రీ కి సినిమాల్లో అవకాశాలు వస్తుండటం వారి మకాం చెన్నై కి మారింది.ఇక జయచిత్ర చెన్నై లోనే పుట్టి పెరిగింది.

తల్లిదండ్రులు ఇద్దరు ఎవరి పనుల్లో వారు బిజీ గా ఉంటె జయ చిత్ర మాత్రం తన అమ్మమ్మ సంరక్షణలో పెరిగింది.ఇక జయ చిత్ర అసలు పేరు లక్ష్మి రోహిణి దేవి.

జయశ్రీ హీరోయిన్ గా తెలుగు లో రోజులు మారాయి, దైవ బలం చిత్రాల్లో నటించగా, తమిళ్ లో మహావీరన్ అనే సినిమాలో నటించింది.

Telugu Ammaji, Daiva Balam, Jaya Shree, Jayachitra, Mother, Tollywood-Latest New

తన తల్లి ఉన్న నటన ఆసక్తి కూతురికి కూడా ఉంది.అందుకే జయచిత్ర కు ఆరేళ్ళ వయసు రాగానే చైల్డ్ ఆర్టిస్ట్ గా భక్త పోతన సినిమాలో నటింపచేసింది.ఆ తర్వాత ఆమెను హీరోయిన్ చేయడం లోను తన తల్లి ప్రోత్సాహం చాల ఉంది.

ఇక జయ చిత్ర తన్న తల్లి స్టార్ హీరోయిన్ అవ్వకపోయిన తాను అంతకు మించి ఎదిగి మంచి నటి అని నిరూపించుకుంది.ఇక జయ చిత్ర సైతం తన కొడుకును హీరో చేయాలనీ చాల ప్రయత్నించింది.

ఆమె నిర్మాతగా మరి కొడుకును హీరో గా పెట్టి కొన్ని సినిమాలు మొదలు పెట్టిన అవి విడుదల కాలేదు.కొన్ని సినిమాలు విడుదల అయినా అవి విజయం సాధించలేదు.

ఆలా జయచిత్ర కొడుకు కెరీర్ ముగిసిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube