మారేడు ఆకులు.వీటినే బిల్వ పత్రాలు అని కూడా పిలుస్తుంటారు.
మూడు ఆకులతో కలిగి ఉండే ఈ మారేడు దళాలు అంటే ఆ బోళా శంకరుడికి మహా ఇష్టం.అందుకే శివ పూజలో పూలు ఉన్నా లేకపోయినా ఖచ్చితగా మారేడు ఆకులు ఉంటాయి.
మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, కోరిన కోర్కెలను త్వరగా నెరవేరుస్తాడని చాలా మంది నమ్ముతుంటారు.అయితే ఆధ్యాత్మిక విషయాలు పక్కన పెడితే.
మారేడు ఆకులు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

మరి మారేడు ఆకులను ఎలా తీసుకోవాలి.? అసలు వాటిని తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య లభాలు ఏంటీ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ఈ మధ్యంలో మధుమేహం బారిన పడుతున్న రోగులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.
ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం ఎంతో అవసరం.అయితే అందుకు మారేడు ఆకులు సూపర్‌గా సహాయపడతాయి.
ఒక గ్లాస్ వాటర్‌లో శుభ్రంగా ఉన్న మారేడు ఆకులను నాలుగు లేదా ఐదు చప్పున వేసుకుని బాగా మరిగించుకోవాలి.అప్పై నీటిలో వడబోసి అందులో చిటికెడు ఉప్పు మరియు మిరియాల పొడి వేసుకుని సేవించాలి.
ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
అధిక వేడితో బాధ పడే వారికి మారేడు ఆకులు గొప్ప ఔషధంగా పని చేస్తాయి.
అవును, రెండు లేదా మూడు మారేడు ఆకుల్ని నమిలి రసాన్నినిదానంగా మింగాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే అధిక వేడి తగ్గి శరీరం చల్లబడుతుంది.

అలాగే గ్లాస్ వాటర్‌లో మారేడు ఆకులను వేసి మరిగించి వడబోసుకోవాలి.ఇప్పుడు ఈ నీటిలో కొద్దిగా తాటి బెల్లం మరియు స్వచ్ఛమైన తేనె కలిపి తీసుకుంటే నీరసం, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.మరియు శరీరంలోని వ్యర్థాలు, విషాలు బయటకు పోయి అవయవాలన్నీ శుభ్ర పడతాయి.