ఆ ఆలయంలోని అమ్మవారి నుదుట కుంకుమ పెడితే కోరిన కోరిక తీరుతుందట.. ఆలయం ఎక్కడంటే?
TeluguStop.com
మనలో చాలామంది మనం కోరుకున్న ప్రతి కోరిక నెరవేరి ఎలాంటి కష్టాలు లేకుండా జీవనం సాగించాలని కోరుకుంటారు.
అయితే ఒక ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా కోరుకున్న ప్రతి కోరిక నెరవేరడంతో పాటు దేవుడి అనుగ్రహం కలిగి శుభ ఫలితాలు కలుగుతాయి.
శ్రీశైలంలోని( Srisailam ) రహస్య ప్రదేశంలో ఉన్న ఇష్ట కామేశ్వరి అమ్మవారిని ( Ishtakameswari Devi )దర్శించుకోవడం ద్వారా మనం కోరుకున్న కోరికలు తీరతాయి.
"""/" /
చాలా తక్కువమందికి తెలిసిన ఈ ఆలయంను స్థానికులు ఇష్టకామేశ్వరి దేవి ఆలయం అని పిలుస్తారు.
మన దేశంలో కేవలం శ్రీశైలంలో మాత్రమే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంది.శ్రీశైలం కూడలి నుంచి కేవలం జీపు మార్గంలో మాత్రమే ఈ ఆలయాన్ని చేరుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
దట్టమైన నల్లమల అడవుల మధ్య ఈ ఆలయం ఉండటం గమనార్హం.ఎన్నో బండరాళ్లను దాటుకుని ఈ మార్గంలో జీపులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
"""/" /
ఈ ఆలయ మార్గానికి వెళ్లే జీపులు అటవీ శాఖ అధికారుల ( Forest Department Officials )అనుమతి తీసుకుని మాత్రమే ప్రయాణం సాగించాలి.
ఎంతో నేర్పు కలిగిన డ్రైవర్లు మాత్రమే ఈ మార్గంలో జీపును నడపగలరు.ఈ ఆలయంలో అమ్మవారికి నుదుట కుంకుమ పెట్టి కోరికలను కోరుకుంటే ఆ కోరికలు తీరతాయి.
స్థానికుల ద్వారా ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.
కేవలం పగటిపూట మాత్రమే జీపులో ప్రయాణం చేసి ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు.రాత్రి సమయంలో జంతువులు సంచరిస్తాయి కాబట్టి ఈ మార్గంలో అనుమతించరు.
శ్రీశైలానికి వెళ్లే ప్రయాణికులు ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా మన కోరికలను తీర్చుకోవడంతో పాటు దేవత అనుగ్రహం పొందే అవకాశాలు ఉంటాయి.
రోడ్డు మార్గం ద్వారా మాత్రమే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.ఇష్టకామేశ్వరి ఆలయం విశిష్టత గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
శుభం మూవీ ట్రైలర్ రివ్యూ.. సమంత నిర్మించిన తొలి సినిమా ట్రైలర్ వేరే లెవెల్!