దారుణం.. బస్సు డ్రైవర్ ని కట్టేసి దాడి చేసిన యజమాని.. (వీడియో)

తాజాగా ఓమ్ని బస్ డ్రైవర్( Omni Bus Driver ) ని చిత్రహింసలకు గురిచేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. చెన్నై – నాగర్ కోయిల్ ( Chennai – Nagar Koil )మధ్య నడిచే ఓమిని బస్సులో పనిచేసే డ్రైవర్ను ఆ బస్సు యజమాని చిత్రహింసలు గురి చేసిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతుంది.

 Bus Driver Tied Up And Assaulted By The Owner, Bus Driver, Panisment, Viral Late-TeluguStop.com

అయితే ఈ విషయంపై సదరు బస్సు డ్రైవర్ యజమానికి తెలియకుండా ప్యాసింజర్ లోను ఎక్కించుకొని డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం.ఓనర్ ను మోసం చేయడంతో అలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

బస్సు డ్రైవర్ ( Bus driver )యజమానికి తెలియకుండా దారి మధ్యలో ప్రయాణికులను ఎక్కించుకొని అందుకు సంబంధించిన డబ్బులను అతడు కాచేసాడన్న నేపంతో విషయం తెలుసుకున్న బస్సు యజమాని ఆ బస్సు డ్రైవర్ను ఓ కడ్డీకి రెండు చేతులను కట్టేసి అతనిపై దాడి చేయడం కనబడుతుంది.డ్రైవర్ రెండు చేతులను ఆఫీస్ లోని కిటికీ కడ్డీలతో వెనుక కట్టేసి చాలాసేపు అతడిని కొట్టినట్లు తెలుస్తోంది.దాడి చేయడంతో డ్రైవర్ చెయ్యి నొప్పితో ఏడుస్తున్న కానీ.

డ్రైవర్ ను ఓమ్ని బస్సు యజమాని విడవలేదంటూ సమాచారం.ఇక అతడిని చిత్రహింసలకు గురి చేస్తున్న సమయంలో ఆఫీసులో ఉన్న మరో వ్యక్తి ఘటనకు సంబంధించిన వీడియోని రహస్యంగా చిత్రీకరించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దాంతో ఆ విషయం నెట్టింట వైరల్ కావడంతో చివరికి ఆ వీడియో కాస్త మానవుల హక్కుల కమిషన్ దగ్గరికి చేరడంతో ఈ విషయంపై తమిళనాడు పోలీసులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

ముఖ్యంగా తోటి వాహనదారుల డ్రైవర్లు కూడా ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఇలా కర్కసంగా వ్యవహరిస్తున్న యజమానులను కఠినంగా శిక్షించాలంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube