ఆ సమయంలో సూర్య వైపు చూడటానికి భయపడ్డా.. రాధికా మదన్ కామెంట్స్ వైరల్!

సూరారై పోట్రు సినిమా( Surarai Potru movie ) దక్షిణాదిలో ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

 Radhika Madan On Suriya Reaction To Her Sarfira Performance, Radhika Mandan, Sur-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమాను బాలీవుడ్ లో సర్ఫిరా గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే.అక్షయ్ కుమార్,రాధికా మదన్( Akshay Kumar, Radhika Madan ) ఇందులో ప్రధాన పాత్రలో నటించారు.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.కాగా ఈ సినిమా విడుదల తర్వాత విడుదలకు ముందు హీరో హీరోయిన్లు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.

అందులో భాగంగానే హీరోయిన్ రాధికా మదన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Telugu Bollywood, Radhikamadan, Radhika Mandan, Sarfira, Surya-Movie

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినిమా నిర్మాత నటుడు సూర్య( Producer actor Surya ) గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.మా నిర్మాత సూర్య చాలా మంచి వ్యక్తి.

ఆయన చాలా తక్కువగా మాట్లాడతారు.సర్ఫిరా సినిమా స్పెషల్‌ స్క్రీనింగ్‌ కు సూర్య హాజరయ్యారు.

సినిమా ప్లే అవుతున్నంత సేపు ఆయన వైపు చూడలేదు.ఎందుకంటే ఆయనకు నా యాక్టింగ్‌ నచ్చుతుందో, లేదో, ఎలా రియాక్ట్‌ అవుతారో అని భయపడుతూ కూర్చొన్నాను.

నా ప్రదర్శన నచ్చితే తప్పకుండా ఏదో ఒకటి చెబుతారు.

Telugu Bollywood, Radhikamadan, Radhika Mandan, Sarfira, Surya-Movie

నచ్చకపోతే సైలెంట్‌గా ఉంటారని నన్ను నేను సమాధానపరచుకున్నాను అలాంటి సమయంలో ఆయన నా వద్దకు వచ్చి బాగా యాక్ట్‌ చేశావు సినిమా బాగుంది అని చెప్పారు.ఆ మాటలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి.ఆ మాటలకు నేను చాలా సంతోషపడ్డాను అని చెప్పుకొచ్చింది రాధిక మదన్.

ఇదే విషయాన్ని మా దర్శకురాలు సుధా కొంగరకు చెప్పగా సూర్య ఆ మాట అన్నారంటే సినిమా తప్పకుండా విజయం అందుకుంటుంది అని బదులిచ్చారు అని ఆమె తెలిపింది.ఈ మేరకు ఇంటర్వ్యూలో భాగంగా రాధిక మదన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube