దారుణం.. బస్సు డ్రైవర్ ని కట్టేసి దాడి చేసిన యజమాని.. (వీడియో)

తాజాగా ఓమ్ని బస్ డ్రైవర్( Omni Bus Driver ) ని చిత్రహింసలకు గురిచేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

చెన్నై - నాగర్ కోయిల్ ( Chennai - Nagar Koil )మధ్య నడిచే ఓమిని బస్సులో పనిచేసే డ్రైవర్ను ఆ బస్సు యజమాని చిత్రహింసలు గురి చేసిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతుంది.

అయితే ఈ విషయంపై సదరు బస్సు డ్రైవర్ యజమానికి తెలియకుండా ప్యాసింజర్ లోను ఎక్కించుకొని డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఓనర్ ను మోసం చేయడంతో అలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. """/" / బస్సు డ్రైవర్ ( Bus Driver )యజమానికి తెలియకుండా దారి మధ్యలో ప్రయాణికులను ఎక్కించుకొని అందుకు సంబంధించిన డబ్బులను అతడు కాచేసాడన్న నేపంతో విషయం తెలుసుకున్న బస్సు యజమాని ఆ బస్సు డ్రైవర్ను ఓ కడ్డీకి రెండు చేతులను కట్టేసి అతనిపై దాడి చేయడం కనబడుతుంది.

డ్రైవర్ రెండు చేతులను ఆఫీస్ లోని కిటికీ కడ్డీలతో వెనుక కట్టేసి చాలాసేపు అతడిని కొట్టినట్లు తెలుస్తోంది.

దాడి చేయడంతో డ్రైవర్ చెయ్యి నొప్పితో ఏడుస్తున్న కానీ. """/" / డ్రైవర్ ను ఓమ్ని బస్సు యజమాని విడవలేదంటూ సమాచారం.

ఇక అతడిని చిత్రహింసలకు గురి చేస్తున్న సమయంలో ఆఫీసులో ఉన్న మరో వ్యక్తి ఘటనకు సంబంధించిన వీడియోని రహస్యంగా చిత్రీకరించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దాంతో ఆ విషయం నెట్టింట వైరల్ కావడంతో చివరికి ఆ వీడియో కాస్త మానవుల హక్కుల కమిషన్ దగ్గరికి చేరడంతో ఈ విషయంపై తమిళనాడు పోలీసులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

ముఖ్యంగా తోటి వాహనదారుల డ్రైవర్లు కూడా ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఇలా కర్కసంగా వ్యవహరిస్తున్న యజమానులను కఠినంగా శిక్షించాలంటూ కామెంట్ చేస్తున్నారు.

ధనుష్ రాయన్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో…