ప్రభుత్వాలు లేదా కాలేజ్ యాజమాన్యం కళాశాలలో అనేకసార్లు ర్యాగింగ్ చేయకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కానీ.కొన్నిసార్లు విద్యార్థులు హద్దు మీరి ర్యాగింగ్ చేసిన సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే బయటికి వస్తున్నాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని పలనాడు జిల్లా( Palnadu district ) నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాల హాస్టల్ లో ర్యాగింగ్ కలకలం సృష్టించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
కళాశాలలో కొందరు సీనియర్లు ఎన్సిసి ట్రైనింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను విచక్షణ రహితంగా చితకబాదిన సంఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.ఇక నెట్టింట వైరల్ గా మారిన వీడియోలో కొందరు అబ్బాయిలు అబ్బాయిని పదేపదే బెత్తాలను తీసుకొని కొట్టడం గమనించవచ్చు.పదేపదే సీనియర్లు ఇలా చేస్తుండడంతో దెబ్బల నొప్పి తాలలేక జూనియర్ విద్యార్థులు ఆ వీడియోని చిత్రీకరించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
ఈ ర్యాగింగ్( Raging Video ) వీడియో వైరల్ కావడంతో నరసరావుపేట పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులను విచారణ చేపట్టారు.నగర వన్ టౌన్ సిఐ కృష్ణారెడ్డి విద్యార్థులను విచారించి జరిగిన సంఘటన గురించి ఆయన తెలుసుకున్నారు.ఈ ఘటన గడిచి చాలా కాలమే జరిగిన తాజాగా ఈ వీడియో కాస్త బయటకు రావడంతో ఈ విచారణ చేస్తున్నారు.ర్యాగింగ్ జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను విద్యార్థి సంఘాల డిమాండ్ చేశాయి.
ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇలా కళాశాలలో ర్యాగింగ్ చేస్తే కఠిన శిక్షలకు గురి కావాల్సి ఉంటుంది.