కొంతమంది ప్రజలు మిగిలిపోయిన చపాతి పిండిని మెత్తగా చేసి అలాగే నిల్వ ఉంచుతూ ఉంటారు.మొత్తం పిండి( Chapathi Dough )ని చపాతీలు చేయడం వృధా అవుతుంది.
కాబట్టి చాలామందికి మిగిలిన పిండిని ఫ్రిజ్లో పెట్టే అలవాటు ఉంటుంది.అలాగే కొందరికి ఒకసారి పిండిని కలిపి రెండు రోజుల పాటు పిండిని అలాగే ఉపయోగించే అలవాటు కూడా ఉంటుంది.
పని సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉంటారు.అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది ఆరోగ్యం పై చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.పిండిని ఫ్రిజ్లో ఉంచడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే మిగిలిపోయిన పిండితో చపాతీలు చేయడం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.ఎందుకంటే ఈ పిండిని కలిపి ఫ్రిజ్లో ఉంచినట్లయితే ఈ పిండితో చేసిన చపాతీలను తినడం వల్ల మీరు కచ్చితంగా అనారోగ్యానికి గురవుతారు.అంతేకాకుండా కడుపులో సమస్యలు ఎదురవుతాయి.అలాగే జీర్ణ క్రియ( Digestion )కు సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి.అలాగే పిండిని పిసికిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఈ ప్రక్రియలో బ్యాక్టీరియా పెరగడం మొదలవుతుంది.
కాబట్టి ఈ పిండిని ఫ్రిజ్లో ఉంచి ఆ తర్వాత చపాతీ( Chapathi )లను తయారు చేయడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు వస్తాయి.ఇంకా చెప్పాలంటే పాత పిండి చపాతి తినడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం( Abdominal pain, constipation ), గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే పిండిని కలపడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు.
ఐదు నిమిషాల పనినీ ఆదా చేసి అనారోగ్యం పాలవడం కంటే చపాతి చేసేటప్పుడు తక్కువ పిండిని కలుపుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.లేదంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు.