ఇదే నెలలో ‘ఆదిపురుష్’ నుండి మరో అప్డేట్.. ఫ్యాన్స్ కు పండుగే!
TeluguStop.com
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేస్తున్న సినిమాల్లో పాన్ ఇండియన్ మూవీ 'ఆదిపురుష్' (Adipurush) ఒకటి.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.
రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు.ఇక బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) సీతగా నటించింది.
అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.
ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది.
జూన్ 16న రిలీజ్ అవ్వనున్న ఈ సినిమా ఈ మధ్యనే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేసింది.
"""/" /
ఇప్పటికే పలు పోస్టర్స్ తో పాటు టీజర్, ఫస్ట్ సింగిల్ వంటివి రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఉన్న నెగిటివిటీని పోగొట్టి పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
వీఎఫ్ఎక్స్ వర్క్ ని అప్ గ్రేడ్ చేసిన తర్వాత ఈ సినిమా ఇప్పుడిప్పుడే మంచి అంచనాలు నెలకొన్నాయి.
మరి అంతా పాజిటివ్ గానే ఉన్న ఈ సమయంలో వరుస అప్డేట్స్ ఇచ్చి ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
"""/" /
ఇక ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్ గురించి ఇప్పుడొక వార్త వైరల్ అవుతుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్ ఈ నెల 29న రాబోతున్నట్టుగా వార్తలు అందుతున్నాయి.
మరి ఆ అప్డేట్ ఏంటో దేనికోసమో అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
జూన్ 16న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.
ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం:ఎమ్మెల్యే