సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గం గురువారం నూతనకల్ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి స్థానిక రైతులు మాట్లాడుతూ వరి నాట్లకు విద్యుత్ సమస్య కొరత తీవ్రంగా ఉంది విద్యుత్ సరఫరాతో అంతరాయంతో వరి నాట్లకు రైతులు పొలం మడి కరిగట్టు ఎక్కువ మొత్తంలో చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.ఉమ్మడి జిల్లాలో సాయంత్రం నుండి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు త్రీఫేస్ కరెంటు నిలిపి వేస్తున్నారని,దీంతో బోర్లు మోటార్లపై ఆధారపడే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా నిర్విరామంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం రైతులకు 24 గంటలు కాకపోయినా కనీసం 16 గంటలైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు,ఇది రైతులందరి బాధ 24 గంటల సంగతి దేవుడు ఎరుగు,12 గంటల నుంచి ఒక నాలుగు గంటలు పెంచి 16 గంటలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు.