ఈ మధ్యకాలంలో కన్నడ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలలో కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ గురించి చర్చించుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ మధ్యకాలంలో ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి.
దీంతో అన్ని ఇండస్ట్రీలలో ఈ సంస్థ గురించి చర్చించుకుంటున్నారు.కాగా ఈ సంస్థలో కేజిఎఫ్, కాంతార లాంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నిర్మాణ సంస్థకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ వార్త విన్న అభిమానులు షాక్ అవుతున్నారు.
అదేమిటంటే రాబోయే ఐదేళ్లలో భారత సినీ పరిశ్రమలో దాదాపుగా 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుందట ఈ సంస్థ.కాగా ఇదే విషయాన్ని హోంబలే నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ వెల్లడించారు.
అన్ని సౌత్ భాషల్లో సినిమాలను నిర్మించడం కోసం హోంబలే సంస్థ ప్రణాళికలను రచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.భారత సినీ పరిశ్రమలో వచ్చే ఐదేళ్లపాటు మూడు వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నాము.

దీనివల్ల భారత్ లో వినోద పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము.ప్రతి ఏడాది ఒక ఈవెంట్ మూవీ తో సహా ఐదారు సినిమాలు ఉంటాయి.ప్రస్తుతం మేము అన్ని దక్షిణ భాషలలో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాము.
సాంస్కృతిక కథల ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులను చేరువ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్పుకొచ్చారు విజయ్.ఇందుకు సంబంధించిన వార్త తెగ చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ అన్ని వేల కోట్ల పెట్టుబడి పెట్టుతుండడంతో షాక్ అవుతున్నారు.
కొందరు ఈ విషయంపై హోంబలే సంస్థకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.







