విద్యుత్ పొదుపునకు పాకిస్తాన్ అమలు చేస్తున్న ప్లాన్ ఇదే..

పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు.ప్రభుత్వం తాజాగా కొత్త ఇంధన సంరక్షణ ప్రణాళికను ఆమోదించిందని, దీని ప్రకారం ఇకపై రాత్రి 8:30 గంటలకు దేశంలోని అన్ని మార్కెట్లు/మాల్స్ మూసివేయబడతాయని ప్రకటించారు.ఆ సమయంలో అత్యధిక విద్యుత్ వినియోగమయ్యే పరికరాల వాడకాన్ని నిషేధించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి.ఫలితంగా పాక్ దేశానికి సంవత్సరానికి 62 బిలియన్ రూపాయలు ($273.4 మిలియన్లు) ఆదా కానుంది.వాతావరణ శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్, ఇంధన శాఖ మంత్రి ఖుర్రం దస్తగీర్ ఖాన్, సమాచార, ప్రసార శాఖ మంత్రి మరియం ఔరంగజేబ్‌ మొదలైనవారంతా కలసి క్యాబినెట్ నిర్ణయాన్ని విలేకరుల సమావేశంలో ప్రకటించారని జియో న్యూస్ తెలియజేసింది.

 Pakistan Government Made A Rule To Close Malls And Markets After 830-pm, Pakista-TeluguStop.com

ఫెడరల్ ప్రభుత్వంలోని అన్ని విభాగాలు తమ విద్యుత్ వినియోగాన్ని 30 శాతానికి తగ్గించాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంబంధిత అధికారులను ఆదేశించారని రక్షణ మంత్రి పేర్కొన్నారు.ఆసిఫ్ నిర్ణయం ప్రకారం కార్యాలయాలలో అనవసరమైన విద్యుత్ వినియోగంపై అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు.క్యాబినెట్ ఆమోదించిన చర్యలు దాదాపు 62 బిలియన్ పాకిస్తానీ రూపాయల ($273.4 మిలియన్లు) ఖర్చును ఆదా చేయడం, ఇంధన దిగుమతి బిల్లులను తగ్గించడంలో సహాయపడతాయని మంత్రులు విలేకరుల సమావేశంలో తెలిపారు.

కరెంటు లేకుండానే కేబినెట్‌ సమావేశం

ఆ ఆదేశాలకు అనుగుణంగానే కేబినెట్‌ సమావేశాన్ని కూడా విద్యుత్ లేకుండా లాంఛనప్రాయంగా నిర్వహించామని మంత్రి చెప్పినట్లు జియో న్యూస్‌ వెల్లడించింది.విద్యుత్ శాఖ సిఫారసుల మేరకు దేశవ్యాప్తంగా అమలు చేయనున్న ఈ ఇంధన పొదుపు పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆసిఫ్ వెల్లడించారు.

ప్రణాళిక ప్రకారం కళ్యాణ మండపాలు రాత్రి 10 గంటలకు, మార్కెట్లు రాత్రి 8:30 గంటలకు మూతపడనున్నాయన్నారు.ఈ మార్గదర్శకాల అమలుతో దేశానికి రూ.62 వేలకోట్లు ఆదా అవుతాయని మంత్రి తెలిపారు.

Telugu Malls, Pakistan, Pakistandefense, Pakistan Rule-Latest News - Telugu

120-130 వాట్ల ఫ్యాన్ల తయారీపై నిషేధం

ఎలక్ట్రిక్ ఫ్యాన్లు తయారు చేసే ఫ్యాక్టరీలను కూడా మూసివేస్తున్నట్లు ఆసిఫ్ ప్రకటించారు.విద్యుత్ అధికంగా వినియోగించేవారు 120-130 వాట్ల శక్తిని వినియోగిస్తారని ఆసిఫ్ తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా 60-80 వాట్లను ఉపయోగించే వినియోగదారులు అధికంగా ఉన్నారన్నారు.

గతంలో దేశంలో 120-130 వాట్ల ఫ్యాన్ల తయారీని కూడా ప్రభుత్వం నిషేధించింది.ఫ్యాన్లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలాకాలంగా అమలు చేస్తోందని రక్షణ మంత్రి తెలిపారు.

అన్ని ప్రభుత్వ సంస్థలు విద్యుత్‌ను ఆదా చేసేందుకు సమర్థవంతమైన పరికరాలను ఏర్పాటు చేస్తామని, విద్యుత్ వినియోగం అధికంగా అయ్యే పరికరాలను నిషేధించామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube