యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం( Ramannapeta ) సిరిపురం గ్రామానికి చెందిన మిర్యాల రామకృష్ణ అకాల మృతికి చింతిస్తూ తన చిన్ననాటి బాల్యమిత్రులు (1999/2000 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ స్నేహ బృందం)గురువారం రూ.2 లక్షల ఆర్థిక సహాయం( Financial assistance ) అందజేసి మానవత్వం చాటుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లవేళలా రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అప్పం గోయల్, తాటి ఉపేంద్రనాథ్,తాటి మహేంద్ర,రుద్ర శ్రవణ్ కుమార్, కట్ట రామిరెడ్డి దోమలపల్లి లక్ష్మణ్ తదితర బాల్యమిత్రులు పాల్గొన్నారు