సలార్ మేకర్స్ నిర్ణయంతో ఫ్యాన్స్ కు ఇబ్బందులు.. వాపోతున్న డార్లింగ్ ఫ్యాన్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) ఫ్యాన్స్ మాత్రమే కాదు.యావత్ సినీ లవర్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో సలార్ ( Salaar ) ఒకటి.

 Prabhas Salaar Pramotions Details, Salaar, Prabhas, Prashanth Neel, Tollywoo-TeluguStop.com

ఈ సినిమా రిలీజ్ కు కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే భారీ హోప్స్ నెలకొన్నాయి.

మరి రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ వారం మొత్తం భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు.వరుస ఇంటర్వ్యూలతో ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీ రాజ్ బిజీ బిజీగా ఉన్నారు.

అయితే ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కు ఇబ్బందులు తప్పడం లేదు.కొన్ని విషయాల్లో క్లారిటీ అనేది రావడం లేదు.

Telugu Salaar, Hombale, Prabhas, Prabhas Salaar, Prashanth Neel, Shruti Haasan,

ఇక నిన్న తెలుగు స్టేట్స్ లో సలార్ బుకింగ్స్ అన్ని చోట్ల కంటే లేట్ గా ఓపెన్ చేసినప్పటికీ భారీ బుకింగ్స్ నమోదు అవుతున్నట్టు తెలుస్తుంది.ఇక నైజాం రిలీజ్ విషయంలో పూర్వ వైభవం అంటూ కొన్ని సింగిల్ స్క్రీన్స్ లో రిలీజ్ డేట్ కు టికెట్స్ నిన్న ఇస్తున్నట్టు ప్రకటన చేసి ఫ్యాన్స్ ను ఇబ్బందులకు గురి చేసారు.ఆయా థియేటర్స్ లో టికెట్స్ ఇస్తున్నట్టు తెలియడంతో భారీ ఎత్తున ఫ్యాన్స్ రావడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.ఫ్యాన్స్ ఎంతకూ కంట్రోల్ అవ్వకపోవడంతో పోలీసులతో దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది.

ఇదంతా ప్లానింగ్ లేకపోవడం వల్లనే జరిగింది అనే టాక్ వస్తుంది.మొత్తానికి మేకర్స్ కారణంగా ఇబ్బందులు తప్పడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు.

Telugu Salaar, Hombale, Prabhas, Prabhas Salaar, Prashanth Neel, Shruti Haasan,

కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించగా డిసెంబర్ 22న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.చూడాలి ఈ మూవీ ఎలాంటి హిట్ ఇస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube