ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది.
మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల స్థానాలకు లెక్కింపు నిర్వహిస్తున్నారు.దీంతో 139 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
విజయంపై వైసీపీ, టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల ధీమా వ్యక్తం చేస్తుండగా సాయంత్రానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.అయితే గతం కంటే భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అభ్యర్థులు అధికంగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.