సినిమా ఇండస్ట్రీ లో ఒకప్పుడు రైటర్స్ కి పెద్దగా వాల్యూ ఇచ్చేవారు కాదు.కానీ కొద్దిరోజుల తర్వాత రోజులు అన్ని మారిపోయాయి రైటర్ లేకపోతే సినిమానే లేదు అనేలా చాలామంది రైటర్స్ ప్రూవ్ చేసారు దాంతో ఇప్పుడు రైటర్స్ కి మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు అయితే ఒకప్పుడు ఇండస్ట్రీ లో అందరికి రెమ్యూనరేషన్స్ చాలా ఎక్కువ గా ఇచ్చేవారు.
కథ రాసి మాటలు రాసిన రైటర్స్ కి మాత్రం చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారు.కానీ త్రివిక్రమ్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది.
ఆయన కథ మాటలు ఇచ్చిన స్వయంవరం,చిరునవ్వుతో,నువ్వు నాకు నచ్చావ్ సినిమాలు హిట్ అయిన తర్వాత మన్మధుడు సినిమా కోసం నాగార్జున కథ అడిగినప్పుడు త్రివిక్రమ్ కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తేనే స్టోరీ డైలాగ్స్ ఇస్తాను అని చెప్పాడట ఈ మాటకి ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది.
అప్పటి వరకు ఉన్న టాప్ రైటర్స్ సైతం 40,50 లక్షల రెమ్యూనరేషన్స్ మాత్రమే తీసుకుంటుంటే ఒక 4 సినిమాలకే ఇంత అడుగుతున్నాడు అని అందరు అనుకున్నారు కానీ ఆయన కథ మాటల్లో అంత దమ్ము ఉంది అని గమనించిన నాగార్జున ఆయన అడిగిన కోటి రూపాయలు ఇచ్చి కథ తీసుకొని వాళ్ళ బ్యానర్ లోనే విజయ భాస్కర్ గారి డైరెక్షన్ లో మన్మధుడు సినిమా చేసారు ఈ సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది.ఇప్పటికి ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.అలా త్రివిక్రమ్ గారి రాక తో రైటర్స్ కి రెస్పెక్ట్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా పెరిగిందనే చెప్పాలి.
ఆ తర్వాత కాలం లో త్రివిక్రమ్ కూడా డైరెక్టర్ గా మారి చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసారు.ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేస్తున్నారు…
.