టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ హీరో అతనే.. ప్రభాస్ తర్వాత ఆ స్థాయి ఎవరిదంటే?

ఆర్మాక్స్ సర్వే సంస్థ ఫలితాలు ప్రేక్షకుల్లో ఎల్లప్పుడూ ఒకింత ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి.

ఈ సంస్థ జూన్ నెల టాలీవుడ్ మోస్ట్ పాపులర్ స్టార్( Tollywood Most Popular Star ) వివరాలను వెల్లడించగా ఆ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ హీరోగా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) నిలవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

ప్రభాస్ వరుసగా ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు.కల్కి సినిమా హిట్ కావడం కూడా ప్రభాస్ కు ఒక విధంగా కలిసొచ్చిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ జాబితాలో ప్రభాస్ తర్వాత స్థానంలో తారక్( Tarak ) నిలిచారు.తారక్ త్వరలో దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఈ జాబితాలో మూడో స్థానంలో నిలవడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తుండటం గమనార్హం.

ఐకాన్ స్టార్ బన్నీ( Bunny ) ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.

"""/" / స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు.

స్టార్ హీరో చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తుండగా ఈ ఏడాది చివర్లో రిలీజయ్యే అవకాశం ఉంది.

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు.

న్యాచురల్ స్టార్ నానికి ఈ జాబితాలో ఏడో స్థానం దక్కడం కొసమెరుపు.మాస్ మహారాజ్ రవితేజ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

"""/" / స్టార్ హీరో చిరంజీవి ఈ లిస్ట్ లో తొమ్మిదో స్థానంలో నిలిచారు.

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

మరో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచారు.

విజయ్ నటించి విడుదలైన ఫ్యామిలీస్టార్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

మనుషులను చంపే తోడేలు కిరణ్ అబ్బవరం.. క మూవీ టీజర్ వేరే లెవెల్ లో ఉందిగా!