రోజురోజుకూ మహిళలపై దారుణాలు ఎక్కువవుతున్నాయి.కామంతో కళ్ళు మూసుకుపోయి ఆడది కనిపిస్తే చాలు మృగాలుగా మారుతున్నారు.
ఈ మధ్య చిన్నపిల్లలపై దాడులు ఎక్కువుగా జరుగుతున్నాయి.ఒక మహిళ ఫుట్ పాత్ మీద తన కూతురుతో కలిసి రాత్రిపూట నిద్రిస్తూ ఉండగా ఒక యువకుడు ఆ బాలికను నోరు నొక్కేసి అక్కడ నుండి ఎత్తుకెళ్లాడు.
తర్వాత ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఈ దారుణమైన ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.సూరత్ లో లాల్ గేట్ ప్రాంతంలో ఫుట్ పాత్ మీద తల్లితో కలిసి ఏడూ సంవత్సరాల బాలిక నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఒక యువకుడు ఆ బాలిక నోరు నొక్కేసి అక్కడి నుండి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.అంతేకాదు ఆ బాలికను చిత్ర హింసలకు గురిచేసి వాడి కామవాంఛ తీర్చుకున్నాడు.
ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఆ యువకుడు ఆ పాపను తీసుకెళ్లే సమయంలో తన నోరు నొక్కేసి తీసుకెళ్లాడు.ఆ బాలికను పక్క వీధిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి అక్కడి నుండి పారిపోయాడు.ఆ పాప అక్కడి నుండి తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది.
అప్పటి వరకు ఆ తల్లి నిద్రిస్తూనే ఉంది.పాప ఏడుస్తూ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది.
పాప జరిగిందంతా చెప్పడంతో ఉదయాన్నే పోలీసులకు ఫిర్యాదు చేసారు.
పోలీసులు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయైన దృశ్యాలను పరిశీలించి ఆ యువకుడిని జమ్మూ పఠాన్ గా గుర్తించారు.
నిందితుడు బాలికను బాగా హింసించాడని మెడ, చేతులు, తొడ వంటి భాగాల్లో పంటి గాట్లు ఉన్నాయని.ఆ బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి పంపామని పోలీసులు తెలిపారు.
నిందితుడి గురించి విచారించగా ఆ తల్లీబిడ్డ నిద్రించే ఫుట్ పాత్ కు పక్కనే ఉన్న మరొక ఫుట్ పాత్ పై ఆ నిందుతుడు నిదురించేవాడని పోలీసుల విచారణలో తెలిసింది.పోలీసులు ఆ నిందితుడిపై కేసు నమోదు చేసుకుని అతని కోసం వెతుకుతున్నారు.