తమ ముఖ చర్మం తెల్లగా, మృదువుగా మెరిసిపోతూ కనిపించాలని దాదాపు ప్రతి ఒక్కరు కోరుకుంటారు.అటువంటి చర్మాన్ని పొందడం కోసం రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు.
అయితే మార్కెట్లో ఉండే కెమికల్ ప్రొడక్ట్స్( Chemical products ) కంటే ఉత్తమంగా పనిచేసే ఒక హోమ్ మేడ్ నైట్ జెల్ ఉంది.రెగ్యులర్ గా ఈ నైట్ జెల్ ను వాడితే వైట్ అండ్ స్మూత్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
మరి ఇంతకీ ఆ నైట్ జెల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న నిమ్మకాయను( lemon ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాగా బాయిల్ అయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) మరియు కట్ చేసి పెట్టుకున్న నిమ్మ ముక్కలు వేసి దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జెల్ లో ఐదు నుంచి ఆరు కుంకుమపువ్వు రేకులు( Saffron petals ) వేసి బాగా మిక్స్ చేసి రెండు గంటలు పాటు పక్కన పెట్టేస్తే మన హోమ్ మేడ్ నైట్ జెల్ అనేది రెడీ అవుతుంది.రోజు నైట్ నిద్రించే ముందు వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న జెల్ ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకొని పడుకోవాలి.

రోజు నైట్ ఈ న్యాచురల్ జెల్ ను కనుక వాడడం అలవాటు చేసుకుంటే అదిరిపోయే స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా ఈ జెల్ మీ స్కిన్ ను సూపర్ వైట్ అండ్ స్మూత్ గా మారుస్తుంది.స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది.చర్మాన్ని బిగుతుగా మార్చి ముడతలు పడకుండా రక్షిస్తుంది.యూత్ ఫుల్ స్కిన్ ను మీ సొంతం చేస్తుంది.అలాగే రెగ్యులర్ గా ఈ నైట్ జెల్ ను ఉపయోగించడం వల్ల చర్మంపై మచ్చలు తగ్గుముఖం పడతాయి.
చర్మం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది.







