ఈటెలతో కొండా దంపతుల సంప్రదింపులు... అసలు కారణం ఇదే..

తెలంగాణ రాజకీయాలలో మాజీ మంత్రి ఈటెల భర్తరఫ్ తరువాత చాలా వేగంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాడు.కేసీఆర్ వ్యూహాలకు ప్రతి వ్యూహం వేస్తూ కేసీఆర్ పై రాజకీయ యుద్ధం ప్రకటిస్తున్నాడు ఈటెల.

 Konda Surekha Couple Consultation With Etela Rajender, Mla Etela Rajender, Konda-TeluguStop.com

అయితే రాజకీయాలలో అందరినీ సంతృప్తి చేయడం అన్నది చాలా కష్టతరమైన విషయం.అయితే ఇప్పటికే అసంతృప్తులు కేసీఆర్ పై పెద్ద ఎత్తున ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే టీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి ఉన్న నాయకులు ఇప్పటి వరకు మాకు సముచిత స్థానం కల్పించలేదని, మధ్యలో వచ్చిన నాయకులకు పదవులు దక్కాయని మొదటి నుండి ఉన్న నాయకులు సైతం ఆగ్రహంగా ఉన్నారు.అలాగే ఇప్పటికే ఎన్నో ఆశలతో టీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొండా దంపతులకు సైతం టీఆర్ఎస్ లో సరైన గుర్తింపు దక్కలేదు.

దీంతో వారు కూడా కేసీఆర్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పుడు ఈ అసంతృప్తులందరు ఈటెల వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.

దీంతో ఇప్పుడు ఈటెలతో కలిసి కొండా దంపతులు భవిష్యత్ కార్యాచరణపై చర్చలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.ఈటెల ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కొండా దంపతులు ఈటెల వెంట నడిచే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

కొండా దంపతుల చర్చల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube