అమెరికా అధ్యక్ష ఎన్నికలు: మరో కొత్త సర్వే.. అందులోనూ బిడెన్‌దే హవా

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది.48 గంటల్లో నూతన దేశాధ్యక్షుడి ఎన్నిక కోసం అగ్రరాజ్యంలో పోలింగ్ జరగనుంది.రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్‌ భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ పత్రాల్లో నిక్షిప్తం చేయనున్నారు.అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి వెలువడుతున్న అన్ని సర్వేల్లోనూ బిడెన్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆసియా, ఆఫ్రికన్ అమెరికన్లు జో బిడెన్‌కే జై కొడుతున్నట్లు ఓ సర్వే పేర్కొంది.2020 కార్పోరేటివ్ ఎలక్షన్ స్టడీ.సెప్టెంబర్ నుంచి అక్టోబర్ చివరి వరకు 71 వేల మందిపై ఆన్‌లైన్‌లో ఓ సర్వే నిర్వహించింది.దీనిలో బిడెన్‌కు 51 శాతం, ట్రంప్‌కు 43 శాతం మంది మద్ధతునిస్తున్నారు.18-29, 30-44 మధ్య వయసున్న వారు బిడెన్‌కు సపోర్ట్ చేస్తుండగా.65 ఏళ్ల వయసు పైబడిన వారు మా ఓటు ట్రంప్‌కేనని చెప్పారు.65 శాతం మంది ఆసియా అమెరికన్లు బిడెన్‌కు, 28 శాతం మంది ట్రంప్‌కు మద్ధతు తెలుపుతున్నారు.ఇక రికార్డు స్థాయిలో 86 శాతం మంది నల్లజాతీయులు బిడెన్‌కు జై కొట్టగా.

 Asian-americans Projected To Supports Joe Biden Over Donald Trump: Survey, Asian-TeluguStop.com

అత్యల్పంగా 9 శాతం మంది మాత్రమే ట్రంప్ వైపు మొగ్గు చూపారు.ఇక స్పానిష్ మాట్లాడే ప్రజలు 59 శాతం బిడెన్‌ వైపే వున్నారు.2016 అధ్యక్ష ఎన్నికల్లో నాటి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌కు ఓటు వేసిన వారిలో 95 శాతం మంది బిడెన్‌కే మద్ధతిస్తుండగా… 2016లో ట్రంప్‌కు ఓటేసిన 90 శాతం మంది తిరిగి ఆయన వైపే మొగ్గుచూపుతున్నట్లుగా సర్వే తెలిపింది.
మరోవైపు అమెరికాలోని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ‘‘ ది ఫాక్స్ న్యూస్’ నిర్వహించిన సర్వేలో ట్రంప్ కంటే బిడెన్ 8 పాయింట్లు ముందంజలో ఉన్నట్లు తేలింది.‘ది ఫాక్స్ న్యూస్’ విడుదల చేసిన సర్వే ఫలితాల ప్రకారం.52శాతం మంది ఓటర్లు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌కు మద్దతు తెలిపారు.44 శాతం మంది నవంబర్ 3న ట్రంప్‌కు ఓటేయనున్నట్లు చెప్పారు.2 శాతం మంది ఎవరికి ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పాగా.మరో రెండు శాతం మంది మూడో అభ్యర్థికి ఓటేయనున్నట్లు తెలిపారు.జాతీయ స్థాయిలోనే కాకుండా అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేసే ముఖ్యమైన రాష్ట్రాల్లో సైతం జో బిడెన్ హవా కొనసాగుతోందని ‘ది ఫాక్స్ న్యూస్’ సర్వే ఫలితాల్లో వెల్లడైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube