95 ఏళ్ల తాత వయస్సులో కూడా పొట్టకూటి కోసం ఈయన చేసే పని చూస్తే కన్నీళ్లే..

ఒకసారి వయస్సు పెరిగిన తర్వాత మనకు ఆలోచించే శక్తి తగ్గిపోతుంది.అలాగే మెమోరీ లాస్( Memory loss ) కూడా వస్తుంది.

 Even At The Age Of 95 Years, The Work He Does For Pottakooti Brings Tears To My-TeluguStop.com

ఏది సరిగ్గా గుర్తించుకోలేం.అలాగే అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.

శరీరం వీక్ అవ్వడం వల్ల ఏ పని సరిగ్గా చేయలేం.వయోభారం వల్ల కొన్నిసార్లు ఇంటి నుంచి బయటకు కూడా వెళ్లలేం.

కొంతమంది మంచానికే పరిమితం అవ్వాల్సి ఉంటుంది.ఆ వయస్సులో ఇంట్లో ఉండటం తప్ప బయటకు వెళ్లి పనులు చేసి డబ్బులు సంపాదించలేరు.

కానీ ఒక 95 ఏళ్ల వృద్ధుడు అంత పెద్ద వయస్సులోనూ కష్టపడి పనిచేస్తున్నాడు.డప్పు కొడుతూ డబ్బులు సంపాదిస్తున్నాడు.డప్పు కొట్టాలంటే శక్తి ఉండాలి.ఎక్కవసేపు కొడితే చేతులు నొప్పి పుడతాయి.

కానీ 95 ఏళ్ల వృద్ధుడు డప్పు కొడుతూ జీవన పోరాటం చేస్తున్నాడు.పొట్టకూటి కోసం ఈ వయస్సులోనూ డ్రమ్స్ వాయిస్తూ డబ్బులు( money ) సంపాదించుకుంటున్నాడు.

ఈ వృద్ధుడికి సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.ఇది బాగా వైరల్ గా మారింది.

ఈ వీడియోలో వృద్ధుడు మెడలో డప్పు వేయించుకుని వాయిస్తున్నాడు.

Telugu Drums, Latest, Livelihood-Latest News - Telugu

కొంచెం సేపు డప్పు వాయించి ఆ తర్వాత అలిసిపోయి క్రింద నేలపై కూర్చున్నాడు.దీంతో ఈ వయస్సులోనే మూడు పూటలా అన్నం కోసం అతడు కష్టపడి పనిచేస్తు తీరుకు అందరూ సలాం( salam ) చేస్తున్నారు.ఈ వీడియో చూసి నెటిజన్లు స్పూర్తి పొందుతున్నారు.

మరికొంతమంది ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు.మే 25న పాండే రిత్విక్ అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.95 ఏళ్ల తాత ఇప్పటికీ కష్టపడుతున్నాంటూ క్యాప్షన్ ఇచ్చాడు.దీంతో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.ఇప్పటివరకు ఈ వీడియోను 18.3 మిలియన్ల మంది వీక్షించారు.28 లక్షలకుపైగా లైక్ లు వచ్చాయి.అలాగే 33 వేల కామెంట్స్ వచ్చాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube