రష్యా, ఉక్రెయిన్ ( Ukraine )మధ్య యుద్దం కొద్దినెలులుగా జరుగుతూనే ఉంది.దీని వల్ల రెండు దేశాలకు నష్టం జరుగుతోంది.
ఈ యుద్దానికి రెండు దేశాల సైనికులతో పాటు ప్రజలు కూడా మరణిస్తున్నారు.అలాగే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది.
అయితే రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.కానీ రెండు దేశాలు వెనక్కి తగ్గడం లేదు.
ఇరు దేశాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు యుద్దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి.ఈ యుద్దం ప్రభావం వేరే దేశాలపై కూడా పడుతోంది.
పలు వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.

అయితే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దం జరగడానికి అమెరికా పాత్ర( America ) కూడా ఉంది.ఉక్రెయిన్‌కు అమెరికా సపోర్ట్ చేస్తోంది.ఆ దేశాన్ని రెచ్చగొట్టి రష్యాపై ఉసిగొల్పుతోంది.
ఉక్రెయిన్‌ను ఆయుధాలు సరఫరా చేస్తోంది.అయితే ఉక్రెయిన్ చిన్న దేశం కావడం, రష్యా దగ్గర ఆయుధ సంపత్తి, సైనికులు ఎక్కువమంది ఉండటంలో ఉక్రెయిన్ తట్టుకోలేకపోతుంది.
ఉక్రెయిన్ కూడా అదే రీతిలో బదలిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.అమెరికాలో ఉన్న ఆయుధ సంపత్తిని ఎలాగైనా అమ్మేసి డబ్బులు సంపాదించుకోవడం కోసం ఉక్రెయిన్ ను అమెరికా రెచ్చగొడుతుంది.

దాదాపు 450 రోజులుగా యుద్దం కొనసాగుతూ ఉండగా.తాజాగా మరో రెండు దేశాల మధ్య యుద్ద వాతారణం నెలకొంది.సెర్బియా, కాసావో( Serbia ) దేశాల మధ్య యుద్ద మేఘాలు అలుముకున్నాయి.కోవాకాకు అమెరికా, యూరప్ దేశాలు మద్దతుగా ఉండగా.సెర్బియాకు రష్యా అండగా ఉంటుంది.గతంలో సెర్బియా నుంచి కాసావో విడిపోగా.
ఆ దేశాన్ని సెర్బియా ప్రత్యేకంగా గుర్తించడం లేదు.కాసావో తమ దేశంలోనే అంతర్బాగంగానే ఉందని చెబుతోంది.
ఈ విషయంలో రెండు దేశాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇది యుద్దానికి దారితీసే పరిస్ధితులకు వస్తుంది.దీంతో త్వరలో మరో యుద్దం తప్పదని చెబుతున్నారు.
సెర్బియాకు రష్యా, చైనా అండగా ఉండగా.కోసావాకు అమెరికాతో పాటు యూరప్ దేశాలన్నీ మద్దతుగా ఉంటున్నాయి.ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దంతో ప్రపచంలో ఆర్ధిక మందగమనం నెలకొంది.ఇప్పుడు మరో దేశాల మధ్య యుద్దం జరిగితే ఆర్ధికపరంగా కూడా నష్టం జరుగుతోంది.







