తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది.ఫిబ్రవరి 17వ తేదీన సెక్రటేరియట్ ను ప్రారంభించునున్నారని సమాచారం.
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.ఈ క్రమంలో కేసీఆరే సెక్రటేరియట్ ను ప్రారంభిస్తారని స్పష్టం చేశారు.
అదేవిధంగా తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.కాగా ఇప్పటికే కొత్త సచివాలయం పనులు దాదాపు పూర్తయ్యాయని సమాచారం.







