'ధమాకా' ఆఫర్ వదిలేసుకున్న మాస్ రాజా.. ఇలా అవుతుందని అనుకోలేదా?

మాస్ మహారాజా అంటేనే ఎనర్జిటిక్ హీరో అని పేరు ఉంది.ఈయన ఎనర్జీని ఎవ్వరు కూడా బీట్ చేయలేరు అనే చెప్పాలి.

 Ravi Teja Lost The Dhamaka Movie Share Offer, Dhamaka Share Offer, Ravi Teja, Dh-TeluguStop.com

ఒకప్పుడు వరుస సూపర్ హిట్స్ తో స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ ఇప్పటికీ అదే స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు.అయితే బాక్సాఫీస్ దగ్గర ఒక సినిమాతో సక్సెస్ అందుకుంటే వెంటనే వరుసగా ప్లాప్స్ ఎదురవుతున్నాయి.

కానీ క్రిస్మస్ కానుకగా ధమాకా సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.రెండు భారీ డిజాస్టర్స్ ఇచ్చిన షాక్ నుండి మెల్లగా ధమాకా హిట్ తో మాస్ రాజా ఫ్యాన్స్ బయట పడ్డారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.100 కోట్ల మార్క్ కు చేరువలో ఉన్న ధమాకా సంక్రాంతి వరకు కూడా పోటీ లేకుండా కలెక్షన్స్ రాబడుతుంది.

క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు అనుకుంటే వెంటనే ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో మరో రెండు ప్లాప్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఇప్పుడు వచ్చిన ధమాకా కూడా రొటీన్ కమర్షియల్ గా ఉంటుందేమో అని ఇది కూడా ప్లాప్ సినిమానే అవుతుందేమో అని కామెంట్స్ వినిపించాయి.

అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది.

అయితే రవితేజ కూడా ముందు ఈ సినిమా విషయంలో నమ్మకం పెట్టుకోలేదేమో అని అందరికి అనిపిస్తుంది.ఎందుకంటే రామారావు సినిమా వరకు ఈయన రెమ్యునరేషన్ కాకుండా బిజినెస్ లో వాటా తీసుకోవాలని అనుకున్నాడు.అందుకోసం ప్రత్యేకంగా తన బ్యానర్ ను కూడా జత చేయగా అది కాస్త బెడిసికొట్టింది.

క్రాక్ సినిమాకు డబుల్ ప్రాఫిట్స్ అందుకోగా ఆ తర్వాత రెండు సినిమాలకు ఇలానే చేయగా లాస్ వచ్చింది.ఇక ధమాకా సినిమా విషయంలో రిస్క్ తీసుకోకుండా రెమ్యునరేషన్ తీసుకుని సైడ్ అవ్వడంతో చాలా మిస్ అయినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో కూడా షేర్ అడిగి ఉంటే పారితోషికం కంటే మరింత ఎక్కువగా వచ్చేవి.కానీ రవితేజ ధమాకా విషయంలో రిస్క్ తీసుకోలేదు.ఇలా ఇతడు ధమాకా లాంటి ఆఫర్ ను పోగొట్టుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube