సాధారణంగా కొందరిలో హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది సరిగ్గా ఉండదు.దీని కారణంగా జుట్టు రోజురోజుకు పల్చగా మారిపోతూ ఉంటుంది.
హెయిర్ గ్రోత్ లేకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి.అలాగే హెయిర్ గ్రోత్ ను పెంచుకోవడానికి మార్గాలు కూడా ఎన్నో ఉన్నాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మీ జుట్టు బీభత్సంగా పెరుగుతుంది.మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek Seeds ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు బాగా పండిన ఒక అవకాడోను( Avocado ) తీసుకోవాలి.
అవకాడో ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు సైతం ఎంతగానో ఉపయోగపడుతుంది.అవకాడోను సగానికి కట్ చేసి గింజ తొలగించి పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో అవకాడో పల్ప్ ను వేసుకోవాలి.
అలాగే నానబెట్టుకున్న మెంతులు, అర కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్( Aloevera Gel ) మరియు అర కప్పు కొబ్బరి పాలు( Coconut Milk ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టు ఎదుగుదల అద్భుతంగా మెరుగుపడుతుంది.కొత్త జుట్టు రావడం స్టార్ట్ అవుతుంది.పలుచగా ఉన్న మీ కురులు దట్టంగా మారతాయి.
అలాగే ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టు రాలడం చిట్లడం కంట్రోల్ అవుతాయి.కురులు తేమగా సిల్కీగా మారతాయి.కాబట్టి ఒత్తైన ఆరోగ్యమైన దృఢమైన కురులను కోరుకునేవారు తప్పకుండా పైన చెప్పుకున్న హెయిర్ మాస్క్ ను ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.