అందరి చర్మ తత్వాలు ఒకే విధంగా ఉండవు.కొందరు డ్రై స్కిన్ ను కలిగి ఉంటే.
మరికొందరు ఆయిలీ స్కిన్ ను( Oily Skin ) కలిగి ఉంటారు.ఇంకొందరికి కాంబినేషన్ స్కిన్ ఉంటుంది.
అయితే ఎటొచ్చీ ఆయిలీ స్కిన్ కలిగిన వారే ఎక్కువ చర్మ సమస్యను ఫేస్ చేస్తుంటారు.ఆయిలీ స్కిన్ వల్ల చర్మంపై దుమ్ము ధూళి పేరుకుపోతుంది.
ఇది మొటిమలు, మచ్చలకు కారణం అవుతుంది.పైగా ఆయిలీ స్కిన్ వల్ల చర్మం ఎప్పుడూ జిడ్డు జిడ్డుగా కనిపిస్తుంటుంది.
మేకప్ వేసుకున్న కూడా కొన్ని నిమిషాలకే చెదిరిపోతుంది.దాంతో ఏం చేయాలో తెలియక తెగ బాధపడిపోతూ ఉంటాయి.
కానీ అస్సలు వర్రీ అవ్వకండి.జిడ్డు చర్మాన్ని రిపేర్ చేయడానికి మ్యాజికల్ రెమెడీ ఒకటి ఉంది.ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మాన్ని తాజాగా కాంతివంతంగా మెరిపించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఆరు నుంచి ఏడు బాదం గింజలు( Almonds ) వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఎగ్ ను బ్రేక్ చేసి వైట్ ను మాత్రం వేసుకోవాలి.
![Telugu Almonds, Tips, Egg White, Skin, Remedy, Latest, Magical Remedy, Oily Skin Telugu Almonds, Tips, Egg White, Skin, Remedy, Latest, Magical Remedy, Oily Skin](https://telugustop.com/wp-content/uploads/2024/07/This-is-a-magical-remedy-to-repair-oily-skin-detailsa.jpg)
ఈ ఎగ్ వైట్ ను( Egg White ) స్పూన్ తో బాగా బీట్ చేసి చివరిగా రెండు టేబుల్ స్పూన్లు బాదం పౌడర్ వేసి మిక్స్ చేయాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.జిడ్డు చర్మంతో బాధపడుతున్న వారికి ఈ రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.
![Telugu Almonds, Tips, Egg White, Skin, Remedy, Latest, Magical Remedy, Oily Skin Telugu Almonds, Tips, Egg White, Skin, Remedy, Latest, Magical Remedy, Oily Skin](https://telugustop.com/wp-content/uploads/2024/07/This-is-a-magical-remedy-to-repair-oily-skin-detailss.jpg)
తరచూ ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మంపై అధిక నూనె తొలగిపోతుంది.స్కిన్ తాజాగా కాంతివంతంగా మెరుస్తుంది.అలాగే ఎగ్ వైట్ మరియు బాదం లో ఉండే పోషకాలు చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి.ముడతలను దూరం చేస్తాయి.చర్మం యవ్వనంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.