పాలస్తీనాకి వ్యతిరేకంగా ట్వీట్స్ చేసిన ఎన్నారై డాక్టర్‌.. దిమ్మతిరిగే షాకిచ్చిన ఆసుపత్రి...

బహ్రెయిన్‌లోని( Bahrain ) ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న ఎన్ఆర్ఐ డాక్టర్‌కు అక్కడి అధికారులు షాకిచ్చారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్‌లో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేయడంతో అతడు ఉద్యోగం కోల్పోయాడు.

 Nri Doctor Who Tweeted Against Palestine Shocked Hospital, Nri Doctor, Bahrain,-TeluguStop.com

ఈ వ్యాఖ్యలను చాలా మంది వినియోగదారులు పాలస్తీనాకు వ్యతిరేకంగా, ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉన్నాయని భావించారు.అతడి సోషల్ మీడియా పోస్ట్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆ పోస్టును అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు.అయితే ఈ సంగతి తెలిసిన వెంటనే భారతీయ కంపెనీకి చెందిన ఆసుపత్రి అతనిని వెంటనే తొలగించింది.

అతని అభిప్రాయాలు తమ విలువలకు ప్రాతినిధ్యం వహించవని పేర్కొంది.ఉద్యోగం కోల్పోయిన ఆ డాక్టర్ పేరు డాక్టర్ సునీల్ రావు.

( Dr.Sunil Rao ) అతను రాయల్ బహ్రెయిన్ హాస్పిటల్‌లో ఇంటర్నల్ మెడిసిన్‌లో నిపుణుడు.ఈ ఆసుపత్రి కేరళలోని త్రివేండ్రంలో ఉన్న కిమ్స్ గ్లోబల్ గ్రూప్‌లో భాగం.భారతదేశం, గల్ఫ్ దేశాలలోనూ అనేక బ్రాంచ్‌లను కలిగి ఉంది.

Telugu Bahrain, Cybercrime, Israel, Nri, Palestine-Telugu NRI

పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్( Palestinian militant group ) అయిన హమాస్‌తో కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నట్లు డాక్టర్ రావు ఎక్స్‌లో కొన్ని ట్వీట్‌లను పోస్ట్ చేశాడు.వీటన్నిటినీ గమనించిన ఆసుపత్రి గురువారం (అక్టోబర్ 19) అతడి కొలువు పీకేసింది.ఇస్లాం మతాన్ని అవమానించేలా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడట.మరొక వినియోగదారు వాటి స్క్రీన్‌షాట్‌లను షేర్ చేయడంతో పాటు ఆసుపత్రి వెబ్‌సైట్‌లో అతని ప్రొఫైల్‌తో పాటు కొంతమంది బహ్రెయిన్ అధికారులను ట్యాగ్ చేయడంతో అతని ట్వీట్లు వైరల్ అయ్యాయి.

బహ్రెయిన్ ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి సైబర్ క్రైమ్ కోసం డాక్టర్ రావును అరెస్టు చేసింది.మతాన్ని అవమానించేలా, సమాజం యొక్క భద్రతను ప్రతికూలంగా ప్రభావితం చేసే ట్వీట్‌లను పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో ప్రకటించింది.

వారు అతని పేరు లేదా ఇతర వివరాలను పేర్కొనలేదు.

Telugu Bahrain, Cybercrime, Israel, Nri, Palestine-Telugu NRI

డాక్టర్ రావు చేసిన ట్వీట్ల గురించి తమకు తెలుసునని, అవి తమ సమాజానికి అభ్యంతరకరంగా ఉన్నాయని ఆసుపత్రి ఎక్స్‌పై ఒక ప్రకటన విడుదల చేసింది.ఆయన ట్వీట్లు, భావజాలం వ్యక్తిగతమని, తమ అభిప్రాయాన్ని, విలువలను ప్రతిబింబించలేదని పేర్కొన్నారు.అతను తమ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని మరియు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నామని మరియు తక్షణమే అతని సేవను రద్దు చేసినట్లు వారు తెలిపారు.

డాక్టర్ రావు అరెస్టుకు ముందు తన చర్యలకు క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించారు.తన మాటలకు, చర్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఎక్స్‌పై మరో ట్వీట్‌ చేశాడు.తాను ఎక్స్‌లో పోస్ట్ చేసిన ప్రకటనకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని, ప్రస్తుత సంఘటన సందర్భంలో ఇది అనుచితంగా ఉందని ఆయన అన్నారు.డాక్టర్‌గా అందరి జీవితాలు ముఖ్యమని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube