నక్క తోక తొక్కిన నాగచైతన్య.. తండేల్ డిజిటల్ రైట్స్ ఆ రేంజ్ లో అమ్ముడయ్యాయా?

అక్కినేని హీరో నాగచైతన్య( Naga Chaitanya ) నక్క తోక తొక్కారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుంది.తండేల్ సినిమా( Thandel Movie ) రైట్స్ పరంగా నాగచైతన్య కెరీర్ లోనే సంచలనం సృష్టించడం హాట్ టాపిక్ అవుతోంది.

 Naga Chaitanya Thandel Movie Digital Rights Details, Naga Chaitanya , Thandel Mo-TeluguStop.com

నాగచైతన్య సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా 40 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.సాయిపల్లవి, చందూ మొండేటి క్రేజ్ కూడా కలిసొచ్చి ఈ సినిమా రైట్స్ ఇంత మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది.

కార్తికేయ 2 సినిమా తర్వాత చందూ మొండేటి( Chandoo Mondeti ) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయింది.ఇప్పటికే విడుదలైన తండేల్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

తండేల్ డిజిటల్ రైట్స్( Thandel Digital Rights ) భారీ మొత్తానికి అమ్ముడైన నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం చైతన్య దశ తిరిగినట్లేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.దేశభక్తి అంశాలకు కూడా ఈ సినిమాలో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

Telugu Chandoo Mondeti, Sai Pallavi, Naga Chaitanya, Nagachaitanya, Thandel, Tha

నాగచైతన్య ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సాయిపల్లవి( Sai Pallavi ) కొంతకాలం గ్యాప్ తర్వాత తండేల్ సినిమాతో లక్ పరీక్షించుకుంటున్నారు.రా రస్టిక్ ప్రేమ కథతో తెరకెక్కుతుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.చైతన్య గతంలో ఎప్పుడూ పోషించని పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది.

Telugu Chandoo Mondeti, Sai Pallavi, Naga Chaitanya, Nagachaitanya, Thandel, Tha

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఒకింత స్పెషల్ గా ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.తండేల్ సినిమా డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.తండేల్ సినిమా ఇతర భాషల ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

ఈ సినిమా చై, సాయిపల్లవి రేంజ్ ను మరింత పెంచుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube