సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరో హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు.అయితే అందులో కొందరు ఒకటి రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు.
ఇంకొందరు ఒకటి రెండు సినిమాలతోనే ప్రేక్షకులకు దగ్గరైపోతుంటారు.వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే అనుకోకుండా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు.
అందులో కొందరు హీరోయిన్స్( Heroines ) పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉండగా మరికొందరు అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరమైన వారు ఉన్నారు.
కానీ ఒకట్రెండు సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంటారు.అందులో సింధు మీనన్( Sindhu Menon ) ఒకరు.ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమాలు త్రినేత్రం చందమామ లాంటి సినిమాలు గుర్తుకు వస్తూ ఉంటాయి.ఈ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.1996లో కన్నడ చిత్రం హులియాలో బాలనటిగా అరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత మోహన్ లాల్, జయరామ్, మమ్ముట్టి సినిమాల్లో నటించింది.శ్రీహారి హీరోగా నటించిన భద్రాచలం సినిమాల్లో నటించింది.తెలుగులో వైశాలి, సిద్ధం, త్రినేత్రం సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించింది.
కాజల్, నవదీప్, శివబాలజీ నటించిన చందమామ( Chandamama ) సినిమాతో సింధుకు మంచి క్రేజ్ వచ్చింది.తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాలో చేస్తున్న సమయంలోనే లండన్ కు చెందిన ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడింది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సింధు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి సంతోషంగా నివసిస్తుంది.అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫ్యామిలీ ఫోటోస్( Sindhu Menon Family ) షేర్ చేస్తుంది.
ఈ క్రమంలోనే సింధూ మీనన్ కూతురి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ ఫోటోస్ లో సింధు అచ్చం అందులో అచ్చం తల్లిలాగే కనిపిస్తోంది.