వింటర్ లో వీటికి దూరంగా ఉండలేదో మీ హెల్త్ డేంజర్ లో పడ్డట్టే.. జాగ్రత్త!

వింటర్ సీజన్( Winter season ) మొదలైంది.పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఈ సీజన్ ను ఎంతగానో ఇష్టపడుతుంటారు.

 Do You Know Which Foods To Avoid In Winter Season? Winter Season, Winter Health,-TeluguStop.com

చలికాలం ఎంత బాగున్నా కూడా ఈ సీజన్ లో కొన్ని కొన్ని సమస్యలు మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి.జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు, కఫం పట్టేయడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మం పొడిబారిపోవడం, అలర్జీలు.

ఇలా ఎన్నో సమస్యలు మన ఆనందాన్ని దూరం చేస్తుంటాయి.వీటన్నిటికి దూరంగా ఉంటూ చలికాలాన్ని మంచిగా ఆస్వాదించాలంటే కచ్చితంగా కొన్ని ఆహారాలను అవాయిడ్ చేయాలి.

Telugu Bad Foods, Tips, Latest, Diet, Season-Telugu Health

ఈ లిస్టులో మొదట చెప్పుకోవాల్సింది స్వీట్స్.చలికాలంలో సహజంగానే స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి.దాంతో రోజు స్వీట్స్ ను తెగ లాగించేస్తుంటారు.అయితే పంచదారతో తయారు చేసిన స్వీట్స్ మన ఇమ్యూనిటీ పవర్ ను దెబ్బతీస్తాయి.ఫలితంగా సీజనల్ వ్యాధులు మనల్ని చుట్టుముట్టి ఊపిరాడకుండా చేస్తాయి.అందుకే షుగర్, షుగర్ తో తయారు చేసిన స్వీట్స్ ని అవాయిడ్ చేయండి.

Telugu Bad Foods, Tips, Latest, Diet, Season-Telugu Health

అలాగే చలికాలంలో పాలు, పాల ఉత్పత్తులకు వీలైనంతవరకు దూరంగా ఉండాలి.ఇవి ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ.ప్రస్తుత శీతాకాలంలో తీసుకుంటే శ్లేష్మం పెరుగుతుంది.దాంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతాయి.ప్రోబయోటిక్స్ కోసం కావాలంటే మీరు రెండు రోజులకు ఒకసారి పెరుగును తీసుకోవచ్చు.చలికాలంలో వేరుశనగలకు కూడా మీరు దూరంగా ఉండాలి.

ఎందుకంటే ఇవి ఎలర్జీలను ప్రోత్సహిస్తాయి.బరువు పెరిగేలా కూడా చేస్తాయి.

శీతాకాలంలో నూనెలో వేయించిన ఆహారాలను డైట్ లో నుంచి కట్ చేయాలి.ఇవి జీర్ణ వ్యవస్థ పనితీరును దెబ్బ తీస్తాయి.

అలాగే జీవక్రియ రేటును నెమ్మదించేలా చేస్తాయి.ఇక చల్ల చల్లని మిల్క్ షేక్స్, కూల్ డ్రింక్స్, పండ్ల రసాలను అవాయిడ్ చేయాలి.

ఇవి కఫాన్ని పెంచుతాయి.శ్వాసకోశ లో అడ్డంకులు ఏర్పడేలా చేస్తాయి.

జలుబు, దగ్గు వంటి సమస్యలకు కారణం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube