ఏపీలో మరో రెండు వారాలలో ఎన్నికలు( AP Elections ) జరగబోతున్నాయి.ఈ క్రమంలో పెన్షన్ పంపిణీ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి.
ఏప్రిల్ మొదటి తారీకు వాలంటీర్లు( Volunteers ) పెన్షన్ పంపిణీ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది.దీంతో ఆ సమయంలో వృద్దులు అనేక కష్టాలు పడ్డారు.
ఇదే సమయంలో అధికార పార్టీ విపక్షాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం జరిగింది.కాగా ఇప్పుడు మే మొదటి తారీకు వస్తూ ఉండటంతో మళ్ళీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం( Pension Distribution ) జరగాల్సిన ఉండటంతో పొలిటికల్ వాతావరణం మరింత వేడెక్కింది.
ఇప్పటికే పెన్షన్ లబ్ధిదారుల ఎకౌంటుల్లో డబ్బులు వేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది.ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి( YCP Sajjala Ramakrishna Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు ఆయన ముఠా కారణంగా పెన్షనర్లు అవస్థలు పడుతున్నారని విమర్శించారు.చంద్రబాబు( Chandrababu ) మనిషి జన్మ ఎలా ఎత్తాడో అర్థం కావడం లేదు.సీఎంను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.ఆయనకు పెన్షనర్ల( Pensioners ) ఉసురు తగులుతుంది.
చంద్రబాబు ఏనాడు పెన్షన్లు సరిగా ఇవ్వలేదు.కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అలవాటు.
కూటమి డిపాజిట్లు గల్లంతు అవటం గ్యారెంటీ అని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.