ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తోంది.ఇండస్ట్రీలోకి డైరెక్టుగా హీరోలుగా ఎంట్రీ ఇచ్చే వారు కొంతమంది అయితే మొదట చైల్డ్ ఆర్టిస్టుగా చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని తర్వాత ఒక వయసు వచ్చాక ఇక హీరో గా ఎంట్రీ ఇస్తున్న వారు మరికొంతమంది.
ఇలా ఇటీవలి కాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ లే హీరోగా మారిపోతుండటం ఎక్కువగా జరుగుతూ ఉంది.అంతే కాదు ఇలా హీరోలుగా మారుతున్న చైల్డ్ ఆర్టిస్టులు అటు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నారు.
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన తనీష్ ఎన్నో సినిమాల్లో హీరోగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇటీవలి కాలంలో ఇంద్ర సినిమాలో బుల్లి చిరంజీవిగా ప్రేక్షకులను పలకరించిన తేజ హీరోగా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకుంటున్నాడు.
కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించిన పూరి కొడుకు ఆకాష్ పూరి కూడా హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఆనంద్ వర్ధన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
సూర్య వంశం అనే సినిమాలో జూనియర్ వెంకటేష్ కొడుకు గా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన ఆనంద్ వర్ధన్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కూడా నటించారు.
ఇప్పుడు హీరో గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనంద్ తన జీవితంలో ఎదురైన ఒక భయానక ఘటన గురించి చెప్పుకొచ్చారు.ఒక సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో తనకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని తెలిపాడు.
ఇక ఇలా ఫైర్ ఆక్సిడెంట్ లో తీవ్రంగా గాయాలు అయ్యాయి అంటూ చెప్పుకొచ్చాడు.అంతేకాదు ఇక రెండు నెలలపాటు ఐసీయూలో చికిత్స తీసుకున్నాను అంటూ ఆనంద్ వర్ధన్ తెలిపాడు.
లైఫ్ అంత ఈజీ కాదని ఇక ఎన్నో ఫేస్ చేశాను అంటూ చెబుతున్నాడు.ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కానీ ఇప్పుడు మాత్రం అందరికంటే లేటుగా వచ్చినా లేటెస్ట్ గా ఇండస్ట్రీలో హీరోగా పాతుకు పోతాను అంటూ చెబుతున్నాడు ఆనంద్ వర్ధన్.