ఉంగుటూరు ఎన్నికల ప్రచారంలో వైసీపీపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) సోమవారం ఉంగుటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారంలో వైసీపీ ప్రభుత్వం( YCP Govt )పై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Pawan Kalyan Serious Comments On Ycp During Unguturu Election Campaign, Janasena-TeluguStop.com

స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసు.ఇంటి దగ్గరే రోడ్లు వేయించుకోలేని వ్యక్తి.

అటువంటి వ్యక్తి ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తాడు అని విమర్శించారు.కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అని మాట ఇచ్చారు.

జగన్ ప్రభుత్వంలో పేకాట క్లబ్ లు, ఇసుక దోపిడి, మద్యం మాత్రమే అభివృద్ధి చెందాయి అంటూ సెటైర్లు వేశారు.వైసీపీ ఓడిపోయే పార్టీ.

దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.ఏపీలో గజాల స్థలం ఉన్నవారైనా సరే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Telugu Janasena, Pawan Kalyan, Pawankalyan, Ycp, Ys Jagan-Latest News - Telugu

దున్నని భూమి అంతా జగన్( YS Jagan ) లాగేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.భారతదేశ పాస్ పోర్ట్ మీద మోడీ గారి బొమ్మ ఉండదు.మరలాంటప్పుడు మన భూమికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలపై జగన్ బొమ్మ ఎందుకు.దరిద్రంగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రం ఉండాలి.నవ్వుతూ ఉండే ఆ తండ్రి లేని బిడ్డ ఫోటో మనకెందుకు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో పునరుద్ధరిస్తామంటూ స్పష్టం చేశారు.స్కూళ్లలో పిల్లలకు ఇచ్చే పుస్తకాలపై జగన్ ఫొటో( Jagan Photo ) పెట్టడమేంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.‘ఐదేళ్ల నుంచి బెయిల్ పై ఉన్న వ్యక్తి బొమ్మ పుస్తకాలపై పెట్టడమేంటి? జగన్ హయాంలో 3.80 లక్షల మంది విద్యార్థులు పాఠశాల మానేశారు.పిల్లలకు ఇచ్చే చిక్కీ కవర్లపై రూ.67 కోట్ల కొట్టేసిన వ్యక్తి జగన్.ఆయన హయాంలో పేకాట క్లబ్బులు, మద్యం, ఇసుక దోపిడీలే ఉన్నాయి.

వైసీపీ ఓటమి తథ్యం’ అని గణపవరం సభలో పవన్ విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube