ఏపీలో ఎన్నికల( AP Elections ) దగ్గర పడే కొలది రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది.ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది.
మరో రెండు వారాలలో పోలింగ్ జరగనుంది.దీంతో ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు.
ఆల్రెడీ వైసీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది.రేపు కూటమి పార్టీల మేనిఫెస్టో( Alliance Manifesto ) విడుదల కానుంది.
ఏపీలో 2019 కంటే 2024 ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.ఈసారి ఏ పార్టీ గెలుస్తుందో… ఎవరు చెప్పలేకపోతున్నారు.ఏపీలో ప్రధాన పోటీ వైసీపీ వర్సెస్ ఎన్డీఏ కూటమి( YCP vs NDA ) మధ్య ఉంది.2014లో ఇదే కూటమి అధికారంలోకి రావడం జరిగింది. మరి 2024 ఎన్నికలలో కూటమి గెలుస్తుందో లేదో అనేది తేలాల్సి ఉంది.పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో ఈసారి ఎన్నికలకు కొత్త పార్టీలు కూడా కొట్టుకొచ్చాయి.
ఈ రకంగానే భారత చైతన్య యువజన పార్టీ( Bharatha Chaitanya Yuvajana Party ) అవతరించింది.బోడె రామచంద్ర యాదవ్ పార్టీని స్థాపించారు.ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బోడే రామచంద్ర యాదవ్( Bode Ramachandra Yadav ) కాన్వాయ్ పై కొందరు రాళ్లతో దాడి చేశారు.సోమవారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఎర్రతివారి పల్లెలో ఈ ఘటన జరిగింది.
దాడిలో కాన్వాయ్ లోని 10 వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి.అధికార పార్టీ కార్యకర్తలే ఈ విధ్వంసానికి పాల్పడ్డారని బీసీవై పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఈ ఎన్నికలలో పుంగనూరు నుండి బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పోటీ చేస్తున్నారు.







