తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది సూర్య( Hero Surya ) అనే చెప్పాలి.ఈయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరు అనెంతలా ఒక క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టైన సరే ఆ పాత్రలో నటించి మెప్పిస్తాడు.
ఇక మొత్తానికైతే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాలు కూడా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు కంగువ సినిమా( Kanguva )తో మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా హైలీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతుంది.మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమాతో సూర్య సూపర్ సక్సెస్ అందుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే యశ్( Hero Yash ) కేజీఎఫ్ తో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.
ఇక ఈ సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయితే సాధించాడు.అయితే సూర్య, యశ్ లను హీరోలుగా పెట్టి సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ కె ఈ జ్ఞానవేల్ రాజా( KE Gnanavel Raja ) ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

మరి ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎవరు వ్యవహరిస్తారు అనేది కూడా ఇప్పుడు చర్చనియాంశంగా మారింది.మరి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లతో ఈ సినిమా చేయిస్తారా లేదా తెలుగులో ఉన్న టాప్ డైరక్టర్ దీనికి డైరెక్షన్ చేయబోతున్నారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే సూర్య, యశ్( Surya Yash Multistarrer ) లా కాంబో లో వచ్చే సినిమా అదిరిపోతుంది అంటూ అభిమానులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…
.







