మనిషి ఆరోగ్యంగా ఉండడానికి క్రమం తప్పకుండా సరైన పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి.ఇందులో కూరగాయలతో కూడిన భోజనం శరీరానికి అనేక పోషకాలను అందిస్తుందని దాదాపు చాలామందికి తెలుసు.
కూరగాయలలోని ఖనిజాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.మాంసాహారాల కన్నా వెజిటేబుల్స్ శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతాయని కొన్ని అధ్యయనాలలో తెలిసింది.
అయితే కొన్ని కూరగాయలలో ఎన్నో ప్రోటీన్లు మూలకాలు ఉన్న వాటిని రాత్రి సమయంలో అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.వీటిని ఉదయం మాత్రమే తీసుకోవాలని, రాత్రి సమయంలో తీసుకుంటే పోషకాలు మన శరీరానికి అందక పోగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంతకీ రాత్రి సమయంలో తినకూడని కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే కాలీఫ్లవర్( Cauliflower ) ను గోభి పువ్వు అని కూడా అంటారు.దీనిని కూరగా వండుకుంటే ఎంత రుచిగా ఉంటుంది.వివిధ చర్మ వ్యాధులను నివారించడంలో కాలిఫ్లవర్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.బరువు తగ్గడానికి కూడా కాలీఫ్లవర్ మంచి ఆహారం గా పనిచేస్తుంది.అయితే కాలీఫ్లవర్ కడుపు ఉబ్బరం( Stomach Bloating ) సమస్య ఉన్నవారు రాత్రిపూట అసలు తినకూడదు.
ఇంకా చెప్పాలంటే క్యాబేజీ( Cabbage )లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.అలాగే ఇందులో రైబోప్లేవిన్, పోలేట్, థయామిన్, మెగ్నీషియం పోషకాలు కూడా ఉంటాయి.
వీటిలో ఉండే బీటా కెరోటిన్ కన్నుల సమస్యలను దూరం చేస్తుంది.

ఇందులో ఎమినో యాసిడ్స్ అధికంగా ఉంటుంది.అయితే దీనిని రాత్రి సమయంలో తినడం వల్ల తొందరగా జీర్ణం అవ్వదు.ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
అలాగే రాత్రి సమయంలో వెల్లుల్లి ఎక్కువగా తినకుండా ఉండాలి.ఇందులో ఉండే పదార్థాలు నిద్ర రాకుండా చేస్తాయి.
అలాగే పచ్చి బఠానీలు( Green Peas ) తినడం వల్ల అదనంగా ఎనర్జీ వస్తుంది.కానీ రాత్రి సమయంలో వీటిని తింటే ఏమాత్రం జీర్ణం కావని నిపుణులు చెబుతున్నారు.